కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఎన్నికల సంఘం. ఏప్రిల్ 24న జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఓ వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలను సుమోటోగా స్వీకరించి వివరణనివ్వాల్సిందిగా కోరింది.
ఎన్నికల ప్రచారంలో మత సంబంధమైన వ్యాఖ్యలను చేయకూడదన్న సుప్రీం మార్గదర్శకాలను గిరిరాజ్ ఉల్లంఘించారని ఆరోపించింది. ఏప్రిల్ 25నే జిల్లా అధికారులు గిరిరాజ్‌పై కేసు నమోదు చేశారు.
" ఎవరైతే వందే మాతరం అని పలకరో, మాతృదేశాన్ని గౌరవించరో వారిని జాతి క్షమించదు."
-ఏప్రిల్ 24నాటి సభలో గిరిరాజ్
ఇదీ చూడండి: భాజపా అభ్యర్థి సంజయ్ జైస్వాల్‌పై కర్రలతో దాడి..