ETV Bharat / bharat

జన్యుపరంగా స్థిరంగానే వైరస్‌!

కరోనాకు సంబంధించి మరో ఊరట కల్గించే అంశాన్ని కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ జన్యుపరంగా స్థిరంగానే ఉందని, ఎలాంటి భారీ ఉత్పరివర్తనాలు చోటుచేసుకోలేదని తేలిపింది. దీనికి సంబంధించిన రెండు దేశవ్యాప్త అధ్యయనాలు ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు పేర్కొంది.

Genome-studies-suggest-virus-genetically-stable
జన్యుపరంగా స్థిరంగానే వైరస్‌!
author img

By

Published : Oct 18, 2020, 9:31 PM IST

కరోనావైరస్‌ను ఎదుర్కోవడంలో భాగంగా ఇప్పటికే వ్యాక్సిన్‌ కోసం ముమ్మర కృషి జరుగుతోంది. ఈ సమయంలో మరో ఊరట కలిగించే విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ జన్యుపరంగా స్థిరంగానే ఉందని, ఎలాంటి భారీ ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్లు) చోటుచేసుకోలేదని తేలింది. దీనికి సంబంధించిన రెండు దేశవ్యాప్త అధ్యయనాలు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది.

కరోనా వ్యాక్సిన్‌ తుది దశ ప్రయోగాలకు చేరుకున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో మ్యుటేషన్ల ప్రభావం ఎక్కువగా ఉందని గుర్తించారు. ఇది వ్యాక్సిన్‌ సమర్థతపై ఆందోళన కలిగించింది. అయితే, దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ జన్యుక్రమంపై ఐసీఎంఆర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ (డీబీటీ) అధ్యయనాలు జరిపాయి. ప్రస్తుతం వైరస్‌ జన్యుపరంగా స్థిరంగానే ఉందని, భారీ మ్యుటేషన్లు‌ చోటు చేసుకోలేదని ఈ పాన్‌ ఇండియా సర్వేలు స్పష్టంచేశాయి.

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ జన్యుపరంగా 5.39శాతం మ్యుటేషన్లు చెందినట్లు గత నెలలో జరిగిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇది దాదాపు 72 దేశాల్లో ఇదే రకంగా ఉన్నట్లు పరిశోధన బృందం పేర్కొంది. అమెరికా(3.27శాతం), యూకే (3.59శాతం), భారత్‌(5.39శాతం) దేశాల్లో ఇదే రకంగా స్వల్ప మ్యుటేషన్లు జరిగినట్లు ఈ అధ్యయనం తెలిపింది.

దశాబ్దాలు..

అయితే, కాలానుగుణంగా ఈ స్వల్ప మార్పులు (డ్రిఫ్ట్స్‌) సంభవిస్తూనే ఉంటాయి. కానీ, ఉత్పరివర్తనాల్లో భారీ మార్పులు (షిఫ్ట్స్‌) సంభవించడానికి దశాబ్దాల సమయం పడుతుందని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ ఇటీవలే వెల్లడించారు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం ఏర్పడే డ్రిఫ్ట్స్‌ల వల్ల టీకా అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం ఉండదని ఆయన స్పష్టంచేశారు.

సాధారణంగా వైరస్‌ జన్యునిర్మాణంలో వచ్చే మార్పులనే ఉత్పరివర్తనాలుగా(మ్యుటేషన్‌)లుగా వ్యవహరిస్తారు. అయితే, ఇలా ఎన్నోసార్లు మ్యుటేషన్లు జరుగుతూ కొత్తరకం వైరస్‌గా మారుతాయి. ఇలా మార్పులు చెందిన రకం ఒక్కోసారి తక్కువ ప్రభావవంతంగానూ, మరికొన్ని సార్లు వ్యాక్సిన్‌, ఔషధాలకు లొంగకుండా తయారవుతాయి. అయితే, కరోనా వైరస్‌ విషయంలో మాత్రం ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న కరోనా టీకాలపై ప్రస్తుత మ్యుటేషన్ల ప్రభావం ఏమీ ఉండదని అంతర్జాతీయ అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.