ETV Bharat / bharat

పోలీసుల కారు బోల్తా.. గ్యాంగ్​స్టర్​ మృతి - Gangster Feroz Khan news

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ గ్యాంగ్​స్టర్​ మధ్యప్రదేశ్​లో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందాడు. మహారాష్ట్రలో అరెస్టు చేసిన నేరస్థుడ్ని లఖ్​నవూకు తరలిస్తుండగా పోలీసుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా నలుగురికి గాయాలయ్యాయి.

Gangster in police escort killed as car overturns in MP
పోలీసుల కారు బోల్తా.. గ్యాంగ్​స్టర్​ మృతి
author img

By

Published : Sep 28, 2020, 5:21 PM IST

మధ్యప్రదేశ్​ గుణా జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన గ్యాంగ్​స్టర్​ మృతి చెందాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది!

ఉత్తర్​ప్రదేశ్​ బహరాయిచ్​ జిల్లాకు​ చెందిన నేరస్థుడ్ని​ ఫిరోజ్​ఖాన్​ను లఖ్​నవూ పోలీసులు... మహారాష్ట్ర పాల్ఘర్​ జిల్లాలోని నాలాసోపారా ప్రాంతంలో అరెస్టు చేశారు. అక్కడ నుంచి లఖ్​నవూకు తరలిస్తుండగా మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​-బౌతుల్​ జాతీయ రహదారిపై ఓ ఎద్దు(నీల్​గాయ్​)ను ఢీ కొట్టి... పోలీసుల వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఫిరోజ్​ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధరించారు. ఫిరోజ్​ ఖాన్​పై గ్యాంగ్​స్టర్ సహా పలు కేసులున్నట్లు అధికారులు తెలిపారు.

ఇద్దరు పోలీసులు సహా నలుగుర్ని ఆసుపత్రికి తరలించినట్లు లఖ్​నవూ పోలీసు కమిషనర్​ సుజిత్ పాండే తెలిపారు. వాళ్లను సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు చెప్పారు. గ్యాంగ్​స్టర్​ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం భోపాల్​కు తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: కొవిడ్​-19పై సమర్థవంతంగా మరో ఔషధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.