తనకు, తన కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు భాజపా దిల్లీ ఎంపీ, ప్రముఖ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. రెండ్రోజుల క్రితం 2, 3 సార్లు హతమారుస్తామని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు, తన కుటుంబానికి భద్రతను ఏర్పాటు చేయాలని కోరాడు గంభీర్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
"నాకు, నా కుటుంబానికి ఓ అంతర్జాతీయ నంబరు నుంచి కాల్స్ వచ్చాయి. మమ్మల్ని చంపేస్తామంటూ బెదిరించారు. నాకు, నా కుటుంబానికి భద్రత కల్పించాల్సిందిగా కోరుతున్నా."
-గౌతమ్ గంభీర్, భాజపా ఎంపీ, మాజీ క్రికెటర్.
ఇదీ చూడండి : 'హింసను సృష్టించకండి.. ఎవ్వరినీ వదలం'