ETV Bharat / bharat

తాళ్లతో లాక్కెళ్లి కరోనా మృతుడి అంత్యక్రియలు!

author img

By

Published : Jul 31, 2020, 11:03 PM IST

కరోనా సోకితే సొంత వారే దూరంగా ఉండిపోయే పరిస్థితులు ఉన్నాయి. మరణిస్తే కనీసం అంత్యక్రియలు కూడా నిర్వహించలేకపోతున్నారు. ఇలా ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాల్ని మిగుల్చుతోంది మహమ్మారి. తాజాగా కర్ణాటకలో ఓ వృద్ధుడు వైరస్​ బారినపడి మృతి చెందగా.. అతడి మృతదేహాన్ని తాళ్లతో లాక్కెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు వైద్యసిబ్బంది.

Funeral of the Infected dead body By  Pulling from the Rope
కరోనాతో మృతిచెందాడని తాళ్లతో కట్టి లాక్కెళ్లారు!

కొద్ది రోజులుగా మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న కరోనా మహమ్మారి.. అయిన వారి అంత్యక్రియలకూ నోచుకోకుండా చేస్తోంది. కరోనా సోకి ఓ వ్యక్తి మృతి చెందితే.. కుటుంబ సభ్యులకు ఆఖరి చూపూ కరవవుతోంది. వైద్య సిబ్బందే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మృతదేహాలపట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొవిడ్​తో చనిపోయినవారిని అగౌరవ పరచరాదని కేంద్రం వెల్లడించిన మరుసటి రోజే కర్ణాటకలో మృతదేహాన్ని తాళ్లతో లాక్కెళ్లిన అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది.

బెళగావి జిల్లా గొకాక తాలుకాలో కరోనాతో ఓ 92 ఏళ్ల వృద్ధుడు మరణించగా.. అతడి మృతదేహాన్ని తాళ్లతో కట్టి లాక్కెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు వైద్య సిబ్బంది.

మృతుడి బంధువులు ఆగ్రహం..

తమకు పీపీఈ కిట్లు ఇవ్వకుండా బాధ్యతారహితంగా అంత్యక్రియలు నిర్వహించారని.. వైద్యసిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మృతుడి తరఫు బంధువులు. ఈ మేరకు తాలుకా అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి: దోపిడీలు చేస్తున్న కొలంబియా ముఠా అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.