గుజరాత్ సూరత్‌లోని డైమండ్ సిటీలో మరోసారి కోట్లు విలువ చేసే వజ్రాలు చోరీకి గురయ్యాయి. వజ్రాల పరిశ్రమలో పనిచేసేవారే వాటిని అపహరించడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఖత్రాగామ్ పరిధి పటేల్ ఫాలియాలోని డైమండ్ ఫ్యాక్టరీలో ఇద్దరు కార్మికులు చాలా కాలంగా విశ్వాసంగా పనిచేస్తున్నారు. అదే నమ్మకంతో 1200 క్యారెట్లకు పైగా ఉన్న 3 వజ్రాలను హెచ్‌వీకే సంస్థ మేనేజర్‌కు ఇవ్వవలసిందిగా వారి చేతికిచ్చారు నిర్వాహకులు. అదే అదనుగా తీసుకున్న సిబ్బంది వజ్రాలతో పరారయ్యారు.
ఈ వజ్రాల ఖరీదు సుమారు రూ.3 కోట్లు ఉంటుందని తెలిపింది యాజమాన్యం. రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గాలింపు చేపట్టారు.
ఇదీ చదవండి:97ఏళ్ల వయస్సులో సర్పంచ్.. రాష్ట్ర చరిత్రలో రికార్డు