ETV Bharat / bharat

మొగలుల యుగం నుంచి నేటి నాణేల వరకు.. - numismatist

భిన్నమైన అలవాట్లు, అభిరుచులు కొందరికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాయి. అలాంటివారే ఛత్తీస్​గఢ్​కు చెందిన రామ్​సింగ్​ అగర్వాల్. నాణేల సేకరణపై ఆయనకు అమితమైన ఆసక్తి ఉంది. మొగలుల యుగం నుంచి స్వతంత్ర భారత్​ ఇప్పటివరకు విడుదల చేసిన అన్ని నాణేలను ఆయన సేకరించారు.

From Mughal era to independent India, Chhattisgarh man has coins from all period
మొగల యుగంనాటి నాణేల సేకరణతో నయా గుర్తింపు
author img

By

Published : Dec 6, 2020, 11:22 AM IST

మొగల యుగంనాటి నాణేల సేకరణతో నయా గుర్తింపు

అభిరుచులు, అలవాట్లు అమూల్యమైనవి. అవి కొందరిలో భిన్నంగా ఉంటాయి. వారి ఇష్టాల కోసం ప్రత్యేకంగా రోజులో కొంత సమయాన్ని వెచ్చిస్తారు. అవసరమైతే దాని కోసం ఎంత డబ్బు ఖర్చయిన వెనుకాడరు. అటువంటివారే ఛత్తీస్​గఢ్​ కోర్బా జిల్లాకు చెందిన రామ్​సింగ్ అగర్వాల్​. ఇంతకీ ఆయన ఏం చేశారో చెప్పలేదు కదా... మొగలుల యుగం నుంచి ప్రస్తుతం స్వతంత్ర భారత్​ జారీ చేసిన చివరి నాణెం వరకు సేకరించారు. ఇందుకోసం రూ.2 లక్షల వరకు ఖర్చు చేసినట్లు రామ్​సింగ్​ తెలిపారు.

దీనంతటికి ఓ బ్యాంకు మేనేజరే స్ఫూర్తి అని రామ్​ సింగ్​ చెప్పారు. కోర్బాలో జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్​ ఇండస్ట్రీస్​ అధ్యక్షుడిగా ఉన్న సమయం(1970)లో తాను.. యూసీఓ బ్యాంకును సందర్శించగా.. నాణేల సేకరణ కోసం అప్పటి బ్యాంకు మేనేజర్ చెప్పినట్లు రామ్​ సింగ్ తెలిపారు.

1974లో ప్రారంభం

రామ్​సింగ్​ వద్ద మొగలుల యుగం నుంచి భారత్​ ప్రభుత్వం జారీ చేసిన రూ.1000 నాణెం వరకు అన్నీ ఉన్నాయి. రామ్​సింగ్​ తన అభిరుచిని నెరవేర్చడానికి డిమాండ్​ డ్రాఫ్ట్​ ద్వారా వారసత్వ నాణేలను ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. తొలిసారి 1974లో ఓ నాణేన్ని ఆర్డర్ చేసినట్లు ఆయన తెలిపారు. అప్పటి నుంచి కాలంతో పాటు ఆయన అభిరుచి పెరుగుతూ వచ్చింది.

రామ్​సింగ్​ సేకరించిన నాణేల్లో కొన్ని..

  • త్రేతాయుగం నాటి నాణెం. దీనిపై రాముడు, సీతా, హనుమాన్​ చిత్రాలు ఉన్నాయి.
  • మొగలుల యుగానికి చెందిన క్రీస్తుశకం 1500 నాటి నాణెం. దీనిపై ఉర్దూ రచనలు ఉన్నాయి.
  • 1700 నాటి జార్జ్​ చక్రవర్తి చిత్రం ఉన్న నాణెం.

ప్రస్తుతం నాణేలు

  • బృహదీశ్వర ఆలయం నిర్మించి వెయ్యి ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత్​ ప్రభుత్వం విడుదల చేసిన రూ.1000 నాణెం. ఈ నాణేన్ని కూడా సేకరించారు రామ్​సింగ్​.
  • మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద 150 జయంతుల సందర్భంగా విడుదల చేసిన రూ.150 నాణేలు.
  • సిక్కుమత తొలి గురువు 550 జయంతి సందర్భంగా విడుదల చేసిన రూ.550 నాణెం

ఈ నాణేల సేకరణకు రామ్​సింగ్​ దాదాపు 30 దేశాలు తిరిగారు. ఈ క్రమంలో ఏ దేశానికి వెళ్లినా...ఆ దేశ కరెన్సీ తీసుకొస్తారు. ఈ విధంగానే దేశంలో వివిధ ప్రాంతాలను పర్యటించినప్పుడు ఆయా ప్రాంతాల్లో పాత నాణేలను సేకరించే అలవాటు రామ్​సింగ్​కు ఉంది.

నాణేల సేకరణ పట్ల ఉత్సాహం తనకు భిన్నమైన గుర్తింపు తెచ్చిందని రామ్​సింగ్ చెప్పారు.

ఇదీ చూడండి: మదిని దోచే ప్రకృతి అందం.. కరౌలీ సొంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.