ETV Bharat / bharat

పౌరచట్టానికి వ్యతిరేకంగా సుప్రీంలో మరో పిటిషన్ - latest nrc updates

పౌరచట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది ఓ ఎన్​జీఓ సంస్థ. ఈ చట్టం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంది. చట్టం అమల్లోకి రాకుండా చూడాలని వ్యాజ్యం ద్వారా న్యాయస్థానానికి నివేదించింది.

Fresh plea filed in SC challenging constitutional validity of CAA
పౌరచట్టానికి వ్యతిరేకంగా సుప్రీంలో మరో పిటిషన్
author img

By

Published : Jan 4, 2020, 6:22 AM IST

Updated : Jan 4, 2020, 9:42 AM IST

పౌరచట్టానికి వ్యతిరేకంగా సుప్రీంలో మరో పిటిషన్

దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైన 2019 పౌరచట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పౌరహక్కుల రక్షణ సంస్థ (ఏపీసీఆర్) అనే సామాజిక సంస్థ పిటిషన్​ దాఖలు చేసింది. పౌరచట్టం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని పిటిషన్​లో పేర్కొంది. ఈ చట్టాన్ని కార్యరూపం దాల్చకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.

పౌరచట్టంలోని నిబంధనలు, నోటిఫికేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్​ 13, 14, 15, 21, 51 (సి) 51-(ఎ )లను ఉల్లంఘించేలా ఉన్నాయని ఏపీసీఆర్​ ఆరోపించింది. నిబంధనలు ఏకపక్షంగా ఉన్నాయని వాటిని కార్యరూపం దాల్చకుండా చూడాలని పిటిషన్​లో తెలిపింది.

పౌరచట్టంలో పొందుపరిచిన మతపరమైన ఆంక్షలు లౌకిక వాదానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది. ముస్లింలను వారి మతం ఆధారంగా, పుట్టిన స్థలం ప్రకారం వారి పౌరసత్వాన్ని నిర్దేశించటం వివక్ష పూరితమైనదని పిటిషన్​లో ప్రస్తావించింది. పౌరచట్టం, ఎన్​ఆర్​సీలు కార్యరూపం దాల్చితే.. సరైన పత్రాలు లేని అనేక మంది భారతీయులు నిరాశ్రయులవుతారని పేర్కొంది. అందువల్ల ఈ చట్టాలను అమలు కాకుండా న్యాయస్థానం చొరవతీసుకోవాలని పిటిషన్​లో పేర్కొనట్లు ఎన్​జీఓ సంస్థ తెలిపింది.

1955 పౌరచట్టంలోని సెక్షన్​ 3(1)నూ సవాలు చేశారు పిటిషనర్. నాటి చట్టం ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.

New Delhi, Jan 03 (ANI): Jharkhand Chief Minister Hemant Soren met Delhi Chief Minister on January 03. He wished CM Arvind Kejriwal good luck for the upcoming elections in Delhi and said that Delhi's development model will be implemented in Jharkhand with some changes.
Last Updated : Jan 4, 2020, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.