ETV Bharat / bharat

చైనాకు సమాచారం చేరవేస్తున్న జర్నలిస్ట్​ అరెస్ట్​ - చైనాకు సమాచారం చేరవేస్తున్న జర్నలిస్ట్​ అరెస్ట్!​

చైనా నిఘా వర్గాలకు కీలకమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో.... భారత్‌కు చెందిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు రాజీవ్‌ శర్మను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు చైనా మహిళ, ఆమె నేపాల్‌ సహచరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందించినందుకు ఏడాదిన్నరకు రూ.45 లక్షల వరకు రాజీవ్‌ శర్మకు ముట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Freelance journalist Rajeev Sharma arrest
చైనాకు సమాచారం చేరవేస్తున్న జర్నలిస్ట్​ అరెస్ట్!​
author img

By

Published : Sep 19, 2020, 5:08 PM IST

Updated : Sep 19, 2020, 5:45 PM IST

భారత్​కు సంబంధించిన కీలక సమాచారాన్ని చైనా నిఘా వర్గాలకు చేరవేస్తున్నారన్న ఆరోపణలతో... ఫ్రీలాన్స్​ జర్నలిస్ట్ రాజీవ్‌ శర్మ​ను దిల్లీ పోలీసులు అరెస్ట్​ చేశారు. రక్షణ సంబంధిత పత్రాలు ఉన్నందున రాజీవ్​ శర్మను అధికారిక రహస్యాల చట్టం కింద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రాజీవ్​కు భారీ మొత్తంలో నగదు అందించిన చైనా మహిళ, ఆమె నేపాల్ సహచరుడిని కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఎల్​ఓసీ వద్ద భారత బలగాల మోహరింపు, సరిహద్దుల్లో భారత వ్యూహాలను.. రాజీవ్​ చైనా నిఘా వర్గాలకు చేరవేశారని దిల్లీ పోలీసులు తెలిపారు.

"చైనా నిఘా సంస్థలకు సున్నితమైన సమచారాన్ని చేర వేస్తున్న ఫ్రీలాన్స్​ జర్నలిస్ట్​ను ప్రత్యేక విభాగం అరెస్ట్​ చేసింది. షెల్​ కంపెనీల ద్వారా అతనికి భారీ మొత్తంలో నగదు అందింది. 2016-18 మధ్య కాలంలో రాజీవ్​.. కీలక సమాచారాన్ని చేరవేసినట్లు తెలిసింది. అతని నుంచి భారీగా మొబైల్​ ఫోన్లు, ల్యాప్​టాప్​లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నాం. వివిధ దేశాల్లో వారిని కలుసుకునేవాడు."

- సంజీవ్​ కుమార్​ యాదవ్​, డీసీపీ,ప్రత్యేక విభాగం

దిల్లీలోని పిటంపురకు చెందిన రాజీవ్​ శర్మ వద్ద రక్షణ శాఖకు సంబంధించిన కీలక పత్రాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ అంశంలో దర్యాప్తు చేపట్టామని తెలిపారు. మహిపల్పుర్​లో చైనాకు ఔషధాలు ఎగుమతి చేసే సంస్థ ద్వారా ఏజెంట్లకు డబ్బులు ఇస్తున్నట్లు గుర్తించామన్నారు. ఏడాది కాలంలో సుమారు రూ.40-45 లక్షల లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విచారణలో మరిన్ని విషయాలు బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నాయి

రాజీవ్​కు పాత్రికేయంలో 40 ఏళ్ల అనుభవం ఉంది. భారత్​లోని పలు వార్తా సంస్థల్లో పని చేశారు. చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్​ టైమ్స్​కు ఫ్రీలాన్సర్​గా పలు ఆర్టికల్స్​ రాశారు.

ఇదీ చూడండి:ఎన్​ఐఏ తనిఖీలు: అల్​ఖైదాకు చెందిన 9 మంది అరెస్ట్

Last Updated : Sep 19, 2020, 5:45 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.