మణిపూర్లో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉపముఖ్యమంత్రి జాయ్కుమార్ సింగ్ సహా నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి చెందిన నలుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది.
రాజీనామా చేసిన వారిలో.. గిరిజన ప్రాంత అభివృద్ధి మంత్రి ఎన్ కైషి, యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి లెట్పావో హికిప్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఎల్ జయంత కుమార్ సింగ్ ఉన్నారు. జాయ్కుమార్ ఆర్థికమంత్రిగానూ సేవలందించారు.
ముఖ్యమంత్రి ఎన్. బీరెన్సింగ్కు రాసిన లేఖలో.. భాజపా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి తాము తప్పుకుంటున్నామని, కేబినెట్ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఈ నలుగురు నేతలు పేర్కొన్నారు.
కాంగ్రెస్లో చేరిక
మరోవైపు భాజపా ఎమ్మెల్యేలు ఎస్ సుభాష్ చంద్రసింగ్, టిటి హౌకిప్, శామ్యూల్ జెందాయ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా టీఎంసీ చెందిన టి రాబింద్రో సింగ్, స్వతంత్ర ఎమ్మెల్యే షాహాబుద్దీన్ భాజపా ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో.. అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదుపుతోంది.
ఇదీ చూడండి: మహారాష్ట్రలో ఒక్కరోజే 3307 కేసులు, 114 మరణాలు