దేశంలో రోజురోజుకూ కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. కరోనా కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్రలో అత్యధిక వైరస్ కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో గుజరాత్, దిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు ఉన్నాయి.
మహారాష్ట్రలో 20 వేలు దాటిన కేసులు
మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 1,165 మందికి వైరస్ సోకింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 20,228కి చేరినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. ఇవాళ మరో 48 మంది మృతి చెందగా... అక్కడ మొత్తం మరణాల సంఖ్య 779కి పెరిగింది. ఇప్పటి వరకు 3,800 మంది డిశ్చార్జి అయ్యారు.
తమిళనాడులో 6 వేల కరోనా బాధితులు
పొరుగు రాష్ట్రం తమిళనాడులో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 526 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 6,535కు పెరిగినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం వెల్లడించింది. ఇవాళ మరో నలుగురు మృతి చెందగా... మొత్తంగా 44 మంది మహమ్మారికి బలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,824 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.
గుజరాత్లో మరో 394మందికి..
గుజరాత్లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మరో 394 మందికి వైరస్ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 7,797కు చేరినట్లు అధికారులు తెలిపారు. తాజాగా 23 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు 472 మంది వైరస్‌కు బలయ్యారు. ఇవాళ ఒక్కరోజే 219 మంది డిశ్చార్జి కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా 2,091 మందిలో వైరస్ నయమైంది.
దిల్లీలో కొత్తగా 224 మందికి..
దేశ రాజధాని దిల్లీలో ఇవాళ మరో ఆరుగురు ఐటీబీపీ పోలీసులకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. గడిచిన 24 గంటల్లో 224 మందికి వైరస్ సోకినట్లు దిల్లీ అధికారులు తెలిపారు. మరో 68 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,542 మంది మహమ్మారి బారిన పడగా... 2020 మంది కోలుకున్నారు.
మధ్యప్రదేశ్‌లో 3 వేలకు పైగా..
మధ్యప్రదేశ్‌లో నేడు కొత్తగా 116 మంది మహమ్మారి బారినపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 3,457 మందికి వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. వీరిలో 1,480 మంది రికవరీ అయినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 625 కంటెయిన్మెంట్ ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు.
బంగాల్ మరో 11 మంది మృతి
బంగాల్లో నేడు 11 మంది వైరస్‌కు బలయ్యారు. ఆ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 99కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 108 కేసులు నమోదు కాగా... ఇప్పటి వరకు 1,786 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా 1,786 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రాజస్థాన్‌లో వందకు పైగా మృతులు..
రాజస్థాన్‌లో ఇప్పటి వరకు 103 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. కొత్తగా 76 మందికి వైరస్ సోకినట్లు చెప్పారు. మొత్తంగా రాష్ట్రంలో 3,655 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో ఆ రాష్ట్ర రాజధాని జైపూర్ నుంచి 1,165 మంది ఉన్నట్లు సమాచారం.
కర్ణాటకలో 794 మందికి వైరస్..
కర్ణాటకలో ఇవాళ మరో 41 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 794 మందికి వైరస్ సోకినట్లు వెల్లడించారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా 30 మంది మృతి చెందగా, 386 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.
పంజాబ్‌లో మరో 31 కేసులు
పంజాబ్‌లో నేడు మరో 31 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 1,762 మంది ప్రాణాంతక వైరస్ బారిన పడినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,574 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- చండీగఢ్‌లో ఇవాళ మరో 23 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. వీరితో కలిపి ఇప్పటి వరకు 169 మంది వైరస్ బారిన పడ్డారు.
- ఝార్ఖండ్‌లో కేసుల సంఖ్య పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 21 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు అధికారులు. ఇప్పటి వరకు 153 మంది మహమ్మారి బారిన పడ్డారు.
- జమ్ముకశ్మీర్‌లో మరో 13 మందికి వైరస్ సోకగా మొత్తంగా 836 మంది వైరస్ బారినపడినట్లు సమాచారం. వీరిలో కశ్మీర్ లోయలోనే 767 మంది బాధితులు ఉన్నారు. ప్రస్తుతం 459 మంది చికిత్స పొందుతున్నారు. తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
- బిహార్‌లో ఐదుగురు రక్షణ సిబ్బందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మొత్తంగా 579 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. 267 మందికి వైరస్ నయమైంది.
- ఒడిశాలో కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం 17 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా 287 మంది మహమ్మారి బారిన పడ్డారు. ప్రస్తుతం 222 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- కేరళలో ఇవాళ ఇద్దరికి మాత్రమే కరోనా సోకినట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. మొత్తంగా 505 మందికి వైరస్ సోకగా.. వీరిలో 17 మంది మాత్రమే చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.
- హిమాచల్‌ప్రదేశ్‌లో నేడు ఒక్కరికి మాత్రమే వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 52 వైరస్ కేసులు నమోదు కాగా.. 35 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు ముగ్గురు వైరస్‌కు బలయ్యారు.
- హరియాణాలో 675మందికి వైరస్ సోకింది. వీరిలో 376 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా... 290 మంది కోలుకున్నారు. తొమ్మిదిమంది మృతి చెందారు.