మహారాష్ట్ర గోందియా జిల్లాలోని పాంగావాత్లో దారుణం జరిగింది. ఓ బావిలో నీరు నింపడానికి దిగాడు ఓ వ్యక్తి. కానీ ఎన్నో రోజుల నుంచి శుభ్రం చేయకపోవటం వల్ల బావి నుంచి విషవాయువు వెలువడింది. ఆ విషపుగాలి పీల్చి.. ఊపిరాడక సదరు వ్యక్తి మరణించాడు. అతడి అరుపులతో కాపాడేందుకు బావిలోకి దిగిన మరో ముగ్గురు వ్యక్తులూ ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. నలుగురు వ్యక్తుల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇదీ చూడండి:మరోసారి పాక్ దుర్నీతి.. సరిహద్దు వెంబడి కాల్పులు