ETV Bharat / bharat

రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రభుత్వాధికారులు దుర్మరణం - రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రభుత్వాధికారులు మృతి

వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిన ఘటన ఛత్తీస్​గఢ్ దంతెవాడ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రభుత్వాధికారులు సహా ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Four govt officials, driver killed in accident in Chhattisgarh
రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రభుత్వాధికారులు దుర్మరణం
author img

By

Published : Mar 6, 2020, 12:56 PM IST

ఛత్తీస్​గఢ్​ దంతెవాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. వీరిలో నలుగురు ప్రభుత్వాధికారులున్నారని పోలీసులు చెప్పారు.

ఇదీ జరిగింది...

బాధితులు జగదల్పూర్ పట్టణం నుంచి కారులో బార్సూర్ వైపు వెళ్తున్నారు. మార్గ మధ్యలో అడవి ప్రాంతం నుంచి వెళ్లే క్రమంలో.. ఓ మలుపు వద్ద వేగంగా ఉన్న కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు వెల్లడించారు. జగదల్పూర్​ ప్రాంతంలో విధులు నిర్వహించి తిరిగి వస్తుండగా తెల్లవారు జామున 2.30 గంటలకు ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అమిత్​ షా రాజీనామాకు కాంగ్రెస్​ ఎంపీల డిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.