మధ్యప్రదేశ్ షింగ్రౌలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ ట్రక్ బోల్తాపడి.. నలుగురు మృతి చెందారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది.
జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలోని భలైయా తోలా గ్రామంలో రాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సరాయ్ పోలీసులు తెలిపారు.
" లంఘడోల్ గ్రామానికి చెందిన కొందరు సమీప గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవటం వల్ల బోల్తా పడింది. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి."
- శంఖ్దార్ ద్వివేది, సరాయ్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి.
ఘటనా స్థలాన్ని జిల్లా పాలనాధికారి, ఎస్పీ సహా దేవ్సార్ ఎమ్మెల్యే సుభాష్ రామ్చరిత్ వర్మా సందర్శించారు. ఆసుపత్రిలోని బాధితులను పరామర్శించారు.
ఇదీ చూడండి: దిల్లీలో అంతకంతకూ క్షీణిస్తున్న వాయు నాణ్యత