ETV Bharat / bharat

'ఆయుష్మాన్'​ పేరుతో టోకరా.. నలుగురు అరెస్ట్​

author img

By

Published : Jun 1, 2020, 5:16 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'ఆయుష్మాన్​ భారత్​' పథకం పేరిట నకిలీ వెబ్​సైట్​ను నిర్వహిస్తోన్న నలుగురు కేటుగాళ్లను అరెస్టు చేశారు దిల్లీ పోలీసులు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వేల మందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Four arrested in Delhi for running fake Ayushman Bharat Yojana website
'ఆయుష్మాన్'​ వెబ్​సైట్​ పేరిట టోక్రా.. నలుగురు అరెస్ట్​

'ఆయుష్మాన్​ భారత్'​ పేరిట నకిలీ వెబ్​సైట్​ను నిర్వహిస్తోన్న నలుగురు దిల్లీ యువకుల్ని అరెస్ట్​ చేశారు పోలీసులు. నకిలీ వెబ్​సైట్​ ద్వారా వేల మందిని మోసగించారని పోలీసు అధికారులు తెలిపారు. నిందితులు.. ఉమేశ్​(37), రాజత్​(33), గౌరవ్​(26), సీమా రాణి శర్మ(33)ల నుంచి ఒక ల్యాప్​టాప్​, నాలుగు చరవాణిలు, ఎటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

ఎలా చేశారు..?

ఆయుష్మాన్​ ఆరోగ్య పథకం కింద.. సుమారు 5,000 కొలువులు అందుబాటులో ఉన్నాయని నిందితులు తమ వెబ్​సైట్​లో ప్రకటన ఇచ్చారు. ఇందులో వార్డ్​బాయ్​, నర్స్​, ల్యాబ్​ సహాయకులు, ఫార్మాసిస్ట్​ వంటి పోస్టులు ఉన్నాయని నమ్మబలికారు.

సంబంధిత పోస్టుకు అనుగుణంగా ఓ రిజిస్ట్రేషన్​ ఫారమ్​ను ఆ వెబ్​సైట్​లో పొందుపరిచారు. ఈ అప్లికేషన్​ ఫారమ్​ నింపాక.. ఆన్​లైన్​ పేమెంట్​ కింద రూ. 300 నుంచి 500 వరకు (పోస్టును బట్టి) దరఖాస్తుదారులు చెల్లించేలా చేశారు. వీరు చేసిన ఈ మోసాలకు సుమారు 4,200 మందికి పైగా బాధితులు బలయ్యారు.

ట్రస్ట్​తో మొదలై వెబ్​సైట్​ వరకు..

పీఎంజేఎవై స్కీమ్​ పేరుతో మోసాలు జరుగుతున్నట్లు ఎన్​హెచ్​ఏ విభాగానికి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో 'జాతీయ ఆరోగ్య ప్రాధికారిక సంస్థ(ఎన్​హెచ్​ఏ)', 'ఆయుష్మాన్​ భారత్​- ప్రధాన్​ మంత్రి జన్​ ఆరోగ్య యోజన'లు.. మే 26 న దిల్లీ సైబర్​ క్రైమ్​ విభాగానికి ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.

తొలుత ఆయుష్మాన్​ యోజన ట్రస్ట్​ను ఏర్పాటు చేసిన నిందితులు.. తర్వాత దాన్ని నకిలీ ప్రభుత్వ వెబ్​సైట్​గా మార్చారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ వెబ్​సైట్​ ద్వారా 6 రాష్ట్రాల్లో (ఉత్తర్​ప్రదేశ్​, మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, హరియాణ, దిల్లీ, బిహార్​) 5,116 వ్యాక్సిన్​లపై ప్రకటనలు కూడా వచ్చాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో భాగస్వామ్యమైన మరికొందరు నిందితుల గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు.

ఇదీ చదవండి: 'వ్యాక్సిన్​ వచ్చే వరకు పాఠశాలలు తెరవద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.