కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. తాజాగా.. కేరళ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐటీశాఖ మాజీ కార్యదర్శి ఎమ్ శివశంకర్.. తిరువనంతపురంలోని కస్టమ్స్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించి ఆయనను కొన్ని గంటలపాటు ప్రశ్నించారు కస్టమ్స్ అధికారులు.
అంతకుముందు.. తిరువనంతపురంలోని శివశంకర్ నివాసానికి వెళ్లింది ముగ్గురు సభ్యుల కస్టమ్స్ బృందం. బంగారం స్మగ్లింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు అందించింది.
'చర్యలు తప్పవు..'
ఇద్దరు స్మగ్లర్లతో శివశంకర్ మాట్లాడినట్టు ఆయన కాల్ రికార్డుల్లో ఉందని ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు. తాజా ఆధారాలతో ప్రధాన కార్యదర్శి నేతృతంలోని ప్యానెల్ విచారణ జరుపుతోందని వెల్లడించారు. విచారణలో శివశంకర్ దోషిగా తేలితే ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు.
ఇదీ జరిగింది...
ఇటీవల యూఏఈ నుంచి కేరళలోని ఆ దేశ కాన్సులేట్‌కు వచ్చిన పార్సిల్లో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్ అధికారులు గుర్తించారు. యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగి అయిన సరిత్ అనే వ్యక్తి వద్ద నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరిత్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు సాగించారు. తర్వాత ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు... ఈ నెల 12న ఈకేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న, మరో నిందితుడు సందీప్‌ను బెంగళూరులో అరెస్టు చేశారు. అనంతరం కేరళాకు తీసుకొచ్చి.. ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు.
ఇవీ చూడండి:-