అన్నాడీఎంకే బహిష్కృత నేత, జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ ఆసుపత్రి నుంచి ఆదివారం విడుదల కానున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. వైద్యపరీక్షలు అనంతరం ఇంటికి చేరుకోనున్న ఆమెకు కొద్దిరోజుల పాటు హోం క్వారెంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారు.
"శశికళ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పటికే శశికళ ఆరోగ్యంపై వైద్యులు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం వైద్యపరీక్షల అనంతరం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేస్తాము. కరోనా మార్గదర్శకాల ప్రకారం కొంతకాలం ఇంటిలోనే ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు."
-ఆసుపత్రి వర్గాలు
శశికళకు కరోనా లక్షణాలు ఏవీ లేవని వైద్యులు వెల్లడించారు. ఆరోగ్య స్థితి బాగుందని తెలపారు. బీపీ, సుగర్, ఆక్సిజన్ లెవల్స్ కూడా అదుపులో ఉన్నాయన్నారు. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆమెకు ఈ నెల 21న కరోనా నిర్ధరణ అయ్యింది. అవినీతి ఆరోపణ నేపథ్యంలో నాలుగేళ్ల తరువాత జనవరి 27న జైలు నుంచి విడుదలయ్యారు.
ఇదీ చూడండి: చిన్నమ్మ విడుదలతో తమిళ రాజకీయాల్లో మార్పులు?