కర్ణాటక దేవనగెరె జిల్లాలోని 'వీరహైవ పంచమసాలి జగద్గురు పీఠం' ఇది. ఇక్కడ కొంత మంది యోగా, యజ్ఞయాగాలు చేయటం మనకు కనిపిస్తుంది. వారందరూ విదేశీయులే. భారత సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకునేందుకు వచ్చారు. పీఠాధిపతి వచనానంద స్వామి వీరికి యోగా, ధ్యానం, ఆధ్యాత్మికత తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.
వసతి కూడా..
శిక్షణే కాదు.. ఇక్కడికి వచ్చిన వారికి వసతి ఏర్పాట్లు కూడా పీఠమే చూసుకుంటుంది. ఆహారంతో పాటు దుస్తుల బాధ్యతా పీఠానిదే.
పంచమసాలిలో ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆశ్రమం చుట్టూ చాలా మొక్కలుంటాయి. ఇందులో అధికభాగం విదేశీయులు నాటినవే.
'ప్రపంచవ్యాప్తం చేయాలి'
ఆశ్రమాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్నది వచనానంద స్వామి ఆలోచన. పీఠాన్ని జాతీయ పర్యటక స్థలంగా తీర్చిదిద్దాలన్నది ఆయన కల. అన్నింటికీ మించి మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయటమే తన లక్ష్యమంటారు.
ఇదీ చూడండి: వాన నీటిని ఒడిసిపట్టండి: సర్పంచులకు ప్రధాని లేఖ