తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలో ఓ ఏనుగు తీవ్రంగా గాయపడి కనిపించడం కలకలం రేపింది. నోటికి గాయమై బాధపడుతున్న 12 ఏళ్ల గజరాజు మంగారాయ్ ప్రాంతంలో తిరుగుతూ స్థానికుల కంట పడింది. వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అటవీ శాఖ అధికారులు తక్షణమే ఏనుగు వద్దకు చేరుకుని చికిత్స అందించారు. కేరళలో ఇటీవల పేలుడు పదార్థాలు తిని మరణించిన గజరాజు తరహాలోనే.. ఈ ఏనుగు నోటికి గాయాలు ఉన్నాయని గుర్తించారు. అడవి పందుల కోసం అక్రమ వ్యాపారులు ఏర్పాటుచేసిన పేలుడు పదార్థాలను తినడం వల్లే ఇది గాయపడిందని భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: గజరాజులపై ఆగని దాడులు.. మరో రెండు బలి