ETV Bharat / bharat

బిహార్ బరి: సీమాంచల్​లో ఆధిపత్యం ఎవరిది?

రెండో దశ పోలింగ్​కు బిహార్ రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. దక్షిణ బిహార్​లో కుల రాజకీయాలది హవా కాగా.. రెండో దశలో ఓటింగ్ జరిగే సీమాంచల్​లో మతాలు, వర్గాల ఓట్లే కీలకం కానున్నయి. ఇక్కడ ముస్లిం జనాభా అధికంగా ఉన్న నేపథ్యంలో.. లౌకిక పార్టీగా పేరొందిన కాంగ్రెస్​కు, ఆ కూటమికి కలిసొస్తుందా? లేక అగ్రవర్ణాలు, నిశబ్ద ఓటర్ల మద్దతుతో భాజపా ప్రభంజనం సృష్టిస్తుందా? సీమాంచల్​లో ఆధిపత్యం చెలాయించేది ఎవరు?

Focus shifts to Seemanchal for second phase of elections
బిహార్ బరి: సీమాంచల్​లో ఆధిపత్యం ఎవరిది?
author img

By

Published : Oct 31, 2020, 12:55 PM IST

బిహార్​లో తొలి దశ ఓటింగ్ సమరం ముగిసింది. 71 స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం నమోదైంది. ఇక నేతల దృష్టంతా రెండో దశ ఎన్నికలు జరిగే సీమాంచల్ మీదికి మళ్లింది. నవంబర్ 3న జరిగే రెండో దశలో కీలకమైన స్థానాల్లో పోలింగ్ జరగనుంది.

సీమాంచల్ పరిధిలోకి వచ్చే పశ్చిమ చంపారణ్, తూర్పు చంపారణ్, దర్భంగా, మధుబని, అరరియా, పూర్ణియా, కిషన్​గంజ్, కటిహార్, జిల్లాలతో పాటు సమస్తిపుర్, పట్న, వైశాలీ, ముజఫర్​పుర్ జిల్లాల్లో ఈ విడతలో ఓటింగ్ జరగనుంది.

మలుపుతిప్పనున్న ముస్లిం జనాభా!

ఇందులోని పలు జిల్లాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉంది. కిషన్​గంజ్​లో అత్యధికంగా 60 శాతం జనాభా ముస్లింలు కాగా.. అరరియాలో 45 శాతం, కాటిహార్​లో 40 శాతం, పూర్ణియాలో 30 శాతానికి పైగా ముస్లిం జనాభా ఉంది. లౌకికవాద పేరున్న కారణంగా ఈ నాలుగు జిల్లాలు మహాకూటమికి కలిసొచ్చే అవకాశం ఉంది.

మరోవైపు.. కాంగ్రెస్ నేత తారిక్ అన్వర్, అస్రారుల్ హక్, భాజపాకు చెందిన షానవాజ్ హుస్సెన్​లు ఇక్కడి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు కిషన్​గంజ్​లో మంచి పట్టున్న మహ్మద్ తస్లీముద్దీన్ సైతం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

"దక్షిణ బిహార్ ప్రజలతో పోలిస్తే సీమాంచల్ ప్రజల స్వభావం వేరుగా ఉంటుంది. దక్షిణ బిహార్ ఝార్ఖండ్​తో కలిసి ఉంటుంది. అక్కడి రాజకీయాలు కులాలతో ముడిపడి ఉంటాయి. కానీ సీమాంచల్​లో మతాల ఆధారంగా ఓట్ల విభజన ఉంటుంది. ఇక్కడి ముస్లిం జనాభా అధికంగా ఉంది. తారిక్ అన్వర్ వంటి నేతలు ఇటీవలే ఎన్​సీపీని వదిలి కాంగ్రెస్​లో చేరారు. ఇది ఆ పార్టీకి బలం చేకూర్చింది. మహ్మద్ తస్లీముద్దీన్ అనుచరులు ఆర్జేడీకి మద్దతిస్తూ వస్తున్నారు."

-షానవాజ్ మాలిక్, రాజకీయ విశ్లేషకులు, పూర్ణియా

అయితే ముస్లింలు దాదాపుగా మహా కూటమికే అనుకూలంగా ఉన్నారని సామాజిక కార్యకర్త రాహుల్ సహానీ చెప్పారు. ప్రస్తుతం బిహార్ ప్రజలు అయోమయంలో లేరని అన్నారు.

"రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు, యాదవులు మహాకూటమికి మద్దతుగా ఉన్నారు. తమ కమ్యునిటీ ప్రజలంతా భారీ సంఖ్యలో వచ్చి ఓట్లేయాలని ముస్లిం నేతలు కోరుతున్నారు. యాదవులు, దళిత నేతల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. బిహార్ ఓటర్లు ఇప్పుడు అయోమయంలో లేరు."

-రాహుల్ సహానీ, సామాజిక కార్యకర్త

చంపారణ్ ప్రాంతంలో భాజపాకు గట్టి పట్టుంది. 2015లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూలకు వ్యతిరేకంగా బరిలోకి దిగి ప్రభంజనం సృష్టించింది. తూర్పు, పశ్చిమ చంపారణ్ జిల్లాల్లోని 21 సీట్లలో 13 స్థానాలను గెలుచుకుంది.

ముస్లింలు, యాదవుల ఓట్లు మహా కూటమికి వచ్చే అవకాశం ఉండగా.. అగ్రవర్ణాల ఓట్లు భాజపా దక్కించుకుంటుందని బేతియా మార్కెట్ అసోసియేషన్ సభ్యుడు రాజేష్ కుమార్ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో నిశబ్ద ఓటర్లుగా పరిగణించే కొన్ని వర్గాలు ఫలితాలను నిర్దేశించే అవకాశం ఉందని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.