ETV Bharat / bharat

వరద విలయం- బిహార్​లో 73 లక్షల మందిపై ప్రభావం - India Meteorological Department

కుండపోత వర్షాలతో పలు రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహించడం వల్ల వరదలు సంభవిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడుతున్నప్పటికీ.. నదుల ప్రవాహం ప్రమాదకర స్థాయిని మించుతోంది.

flood-like-situation-in-karnataka-death-toll-in-kerala-landslides-climbs-to-26
వరద విధ్వంసం- బిహార్​లో 73 లక్షల మందిపై ప్రభావం
author img

By

Published : Aug 9, 2020, 5:40 AM IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.

బిహార్​లో మరో రెండు లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 73 లక్షల మందిపై వరద ప్రభావం చూపించింది. మొత్తం 23 మంది మరణించారు. పొరుగున ఉన్న నేపాల్​లో భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గందక్, బాగ్​మతీ, కోసీ, కరే, కమలా బాలన్ వంటి నదుల ఉద్ధృతి వల్ల 16 జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి.

యూపీ

ఉత్తర్​ప్రదేశ్​లో వరదలు ప్రమాదకరంగా మారుతున్నాయి. వరద ప్రభావానికి గురైన జిల్లా సంఖ్య 18కి చేరింది. శారదా, రాప్తీ, సరయూ-గాగ్రా నదుల ఉద్ధృతి తగ్గడం లేదు. దేవరియా ప్రాంతంలోని 672 గ్రామాలు వరదల్లో చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు.

అసోంకు ఊరట

అసోంలో వరద పరిస్థితి మెరుగుపడుతోంది. రెండు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చేరిన భారీ నీరు క్రమంగా తగ్గుతోంది. అసోం చిరాంగ్, కంరుప్​ జిల్లాలు వరదల నుంచి బయటపడినట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. దేమాజీ, బాక్సా, కొక్రాఝార్​, మోరిగావ్ జిల్లాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి.

ఇడుక్కి మృతులు 26కి

మరోవైపు కేరళలో వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇడుక్కి జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరణించినవారి సంఖ్య 26కి చేరింది. వర్షాలు తగ్గుముఖం పట్టనప్పటికీ.. ఈ ప్రమాదంలో ఆచూకీ కోల్పోయినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా యంత్రాంగం సమాచారం ప్రకారం 46 మంది జాడ కోల్పోయారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా స్థానికులు... ఎన్​డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయారని అనుమానిస్తున్న నేపథ్యంలో.. వారి కోసం గాలిస్తున్నారు.

పంబా డ్యామ్ నీటి మట్టం 983 మీటర్లు దాటిపోయింది. దీంతో అధికారులు రెండో ఆరెజ్ అలర్ట్ జారీ చేశారు. నీటి మట్టం 984.5 మీటర్లు దాటితే రెడ్ అలర్ట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. 985 మీటర్లు దాటితే డ్యామ్ గేట్లు తెరవనున్నట్లు స్పష్టం చేశారు.

గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు కర్ణాటకలో వరదల్లాంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని నదులు ఇప్పటికీ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. తీరలోని పలు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి.

మళ్లీ వర్షాలు

మహారాష్ట్ర కొల్హాపుర్​లోని పంచగంగ నది ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టినట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. వరద ఉద్ధృతి ఇంకా ప్రమాదకరస్థాయిని మించే ఉన్నట్లు వెల్లడించారు.

నైరుతి రుతుపవనాల కారణంగా మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో ఆగస్టు 10 నుంచి మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న నాలుగు రోజులపాటు దిల్లీకి ఓ మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. హిమాచల్​ ప్రదేశ్​కు రెండు రోజుల పాటు వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. హరియాణా, పంజాబ్​ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాజస్థాన్​లో జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.