మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఒకరు గాయపడ్డారు.
ఈ రోజు తెల్లవారుజామున అత్పాదీ తెహ్సిల్ మండలంలోని పరేకర్వాడీ గ్రామంలో రోడ్డు వెంబడి ఉన్న ఓ చెరువులోకి ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. వాహనంలో డ్రైవర్‌తో సహా మరో ఐదుగురు ఉన్నారు. కారు లోపల ఇరుక్కున వారు తలుపులను తెరుద్దామని ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. దీంతో వారు లోపలే ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరు మాత్రం తలుపు అద్దాలు పగలుగొట్టుకుని బయటపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు కారును జేసీబీ సాయంతో బయటికి లాగారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి : పెళ్లి నుంచి తిరిగివస్తుండగా ప్రమాదం- 10 మంది మృతి