ఝార్ఖండ్లో పిడుగుల ధాటికి వివిధ ప్రాంతాల్లో ఐదుగురు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
దమ్కా జిల్లా మసాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని మక్రాంపుర్ గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో స్నాక్స్ తింటుండగా పిడుగు పడి ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో దుకాణం యజమాని గాయపడగా ఆసుపత్రికి తరలించారు.
అలాగే అస్నా గ్రామంలోనూ పిడుగుపాటు కారణంగా మరో వ్యక్తి మరణించగా, గిరీడీ జిల్లాలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
ఇదీ చూడండి:కొండ చరియలు విరిగిపడి 11 మంది గల్లంతు