కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఉన్నప్పటికీ.. మెరైన్ ఆక్వా పరిశ్రమపై ఆంక్షలు తొలగించింది కేంద్రం. మత్స్యకారుల వేట, చేపల పెంపకం, అమ్మకాలు, మార్కెటింగ్ సేవలు తదితరాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
ఇప్పటికే వ్యవసాయ, అనుబంధ రంగాలకు, వ్యవసాయ పనులకు మినహాయింపు ఇచ్చిన కేంద్రం.. తాజాగా మత్స్య రంగానికి ఆన్వయిస్తూ ప్రకటన చేసింది. మెరైన్ ఫిషింగ్, ఆక్వాకల్చర్ రంగం.. వీటి కార్మికుల కార్యకలాపాలకు లాక్డౌన్ పరిమితుల నుంచి మినహాయింపు కల్పించింది. అయితే ప్రతి ఒక్కరూ కరోనా సోకకుండా భౌతికదూరంతో పాటు పరిశుభ్రతలు పాటించేలా స్థానిక యంత్రాంగం పర్యవేక్షించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.
" ధానా పరిశ్రమ నిర్వహణ, పంటకోత, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, కోల్డ్ చైన్, మార్కెటింగ్, అమ్మకాలు, హేచరీలు, ఫీడ్ ప్లాంట్లు, వాణిజ్య ఆక్వేరియాలు, చేపలు, రొయ్యలు, చేపల ఉత్పత్తుల సరఫరా, చేపల విత్తనం, వీటి అనుబంధ కార్మికులు కార్యకలాపాలన్నింటికీ లాక్డౌన్ నిబంధనల నుంచి మినహాయింపు కల్పిస్తున్నాం."
- కేంద్ర హోంశాఖ
ఇదీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు