ETV Bharat / bharat

భారత్​లో యాక్టివ్​ కేసుల కంటే రికవరీనే ఎక్కువ

author img

By

Published : Jun 10, 2020, 12:47 PM IST

దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తుంటే.. మరోవైపు మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 9985 కేసులు వచ్చాయి. అయితే కోలుకున్నవారి సంఖ్య (135205) తొలిసారి యాక్టివ్​ కేసులను(133632) దాటేసింది.

corona cases in india
భారత్​లో కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజుకు వేల మంది కొవిడ్​ బారినపడుతున్నారు. గడచిన 24 గంటల్లో 9985 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,76,583కు చేరింది. మరోవైపు దేశంలో కొవిడ్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. తొలిసారిగా బాధితుల కంటే కోలుకున్న వారి సంఖ్య పెరగడం ఊరట కలిగిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో సగానికిపైనే బాధితులు కోలుకున్నారు.

First Time: Corona Virus Recoveries Crossed Active Covid-19 Cases In India
దేశంలో కరోనా తాజా లెక్కలు

మొత్తం బాధితుల్లో 1,35,206 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లగా.. ఇంకా 1,33,632 మంది వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. మృతుల సంఖ్య 7,745కు చేరినట్లు తెలిపింది.

దేశంలో కరోనా పరిస్థితి ఇది..

1. దేశంలో కరోనాకు పెద్ద హాట్​స్పాట్​గా ఉన్న మహారాష్ట్రలోనూ సామాజిక వ్యాప్తి లేదని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్​ తోపే వెల్లడించారు. రాష్ట్రంలో కేసులు 90వేలు పైనే ఉన్నాయి. ఇది వైరస్​ పుట్టినిల్లు చైనాలో(84 వేలు) వచ్చిన కేసుల కంటే ఎక్కువ.

2.దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కేసులు మంగళవారమే 51వేలు దాటాయి. ఇది చైనాలోని వుహాన్​ కంటే 700 ఎక్కువ.

3. భారత్​లో అత్యధిక కేసుల జాబితాలో మూడో స్థానంలో ఉంది దిల్లీ. ఇప్పటికే 30వేల మంది ఈ వైరస్​ బారిన పడగా.. జులై నాటికి ఆ సంఖ్య 5 లక్షలకు చేరొచ్చని అంచనా వేశారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎల్​ మనీశ్​ సిసోడియా. ప్రస్తుతం 9వేల బెడ్​లు అందుబాటులో ఉండగా.. త్వరలో 80వేల వాటి సంఖ్య పెంచే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం 22 ప్రైవేటు ఆసుపత్రుల సహాకారం తీసుకుంటున్నారు.

4. తమిళనాడులోని డీఎంకే పార్టీ ఎమ్మేల్యే అన్బళగన్​(61)​ కరోనా పాజిటివ్​ రాగా.. బుధవారం ఉదయం చికిత్స పొందుతూ మరణించారు. దేశంలో మహమ్మారితో చనిపోయిన తొలి ప్రజాప్రతినిధి ఈయనే. ప్రస్తుతం ఈ రాష్ట్రం దేశంలో కేసుల జాబితాలో రెండో స్థానంలో ఉంది.

5.కేరళ ప్రభుత్వం దాదాపు 2 లక్షల మంది కరోనా అనుమానితులపై నిఘా ఉంచింది. వాళ్లందరూ ఇంటివద్దే క్వారంటైన్​లో ఉన్నారు. 1900 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్‌ ఆరో స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్‌, రష్యా, యూకే, స్పెయిన్​లు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు మరణాల రేటులో భారత్‌ 12వ స్థానంలో కొనసాగుతోంది.

ఇదీ చూడండి: కరోనా సోకి డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్​​ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.