ETV Bharat / bharat

బిహార్​లో ముగిసిన తొలిదఫా ఎన్నికల ప్రచారం - బిహార్​ తొలిదశ పోలింగ్​ వివరాలు

బిహార్​లో తొలిదశ పోలింగ్​ జరిగే ప్రాంతాల్లో ప్రచారం పర్వం ముగిసింది. మొదటి ఫేజ్​లో భాగంగా అక్టోబర్​ 28న 71 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

bihar election news
బిహార్​లో ముగిసిన తొలిదశ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Oct 26, 2020, 5:35 PM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొదటి ఫేజ్​ పోలింగ్​ ఈ నెల 28న జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రంతో మొదటి దఫా పోలింగ్​ జరిగే 16 జిల్లాల్లోని 71 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మొదటి ఫేజ్​లో ఆర్​జేడీ అత్యధికంగా 42 స్థానాల్లో బరిలోకి దిగుతోంది.

ప్రచారాలతో ముగింపు..

సోమవారం భాజపా ప్రెసిడెంట్​ జేపీ నడ్డా, జేడీయూ నేతలు కలిసి ఔరంగాబాద్​, పుర్ణియా ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​ ముజాఫర్​పుర్​లోని సక్రా, మహువా ప్రాంతాలు సహా వైశాలీ జిల్లా మహానర్​ నియోజకవర్గంలోని జందహాలో ర్యాలీలు చేపట్టారు.

తేజస్వీ యాదవ్ సమస్తిపుర్​ జిల్లాలోని​ హసన్​పుర్​లో ప్రచారం నిర్వహించారు. తన అన్న తేజ్​ ప్రతాప్​ యాదవ్​ ఇదే ప్రాంతం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో జేడీయూ సిట్టింగ్​ ఎమ్మెల్యే రాజ్​కుమార్​ బలమైన అభ్యర్థిగా తేజ్​తో అమీతుమీ తేల్చుకోనున్నారు. రాఘోపుర్​ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటనతో ప్రచారం ముగించారు తేజస్వీ.

లోక్​జనశక్తి పార్టీ చీఫ్​ చిరాగ్​ పాస్​వాన్​​ కూడా 'బిహార్​ ఫస్ట్​, బిహారీ ఫస్ట్'​ నినాదంతో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఆయన ర్యాలీలకు యువత ఎక్కువగా హాజరయ్యారు.

తొలిదఫా పోలింగ్​ వివరాలివే..

  • పోలింగ్​ జరగనున్న నియోజకవర్గ స్థానాలు: 71
  • పోలింగ్​ జరిగే జిల్లాలు: 16
  • పోటీ చేస్తున్న సభ్యుల సంఖ్య: 1066 (పురుషులు 952, మహిళలు 114)
  • మొత్తం ఓటర్లు: 2కోట్ల 14లక్షల 84వేల 787( పురుషులు 1,12,76,396మహిళలు: 1,01,29,101 మూడో జెండర్​: 599 సర్వీస్​ ఓట్లు: 78,691)
  • పోలింగ్​ కేంద్రాలు: 31380
  • తొలిదఫాలో పార్టీలు పోటీచేస్తున్న స్థానాలు: జేడీయూ- 35, భాజపా - 29, ఆర్​జేడీ - 42, కాంగ్రెస్​ - 21, వామపక్షాలు- 8

నవంబర్​ 3న రెండోదశ, నవంబర్​ 7న మూడోదశ పోలింగ్​ జరగనుంది. నవంబర్​ 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.