మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న సాధ్వి ప్రగ్యా సింగ్ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన కొన్ని గంటల్లోనే మధ్యప్రదేశ్ భోపాల్ లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థిగా ప్రకటించింది అధిష్ఠానం. పార్టీకి కంచుకోటగా ఉన్న కీలక స్థానంలో హిందుత్వ అజెండాను మరోసారి ముందుకుతెచ్చింది కాషాయ పార్టీ.
ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బరిలో ఉన్నారు.
ప్రగ్యా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో కోర్టు ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. నిబంధనల ప్రకారం ఇంకా విచారణను ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సాధ్వి... తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం