ETV Bharat / bharat

నేడు తొలి కిసాన్​ రైలు పరుగులు - Kisan train time table

భారత్​లో శుక్రవారం నుంచి కిసాన్​ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. త్వరగా పాడైపోయే పంట ఉత్పత్తుల్ని గమ్యం చేర్చేందుకు ప్రవేశపెట్టిన ఈ రైలును.. రైల్వే, వ్యవసాయ శాఖ మంత్రులు ప్రారంభించనున్నారు.

KISAN RAIL
భారత్​లో నేడు తొలి కిసాన్​ రైలు పరుగులు
author img

By

Published : Aug 7, 2020, 7:37 AM IST

దేశంలోనే తొలి కిసాన్​ రైలు శుక్రవారం పరుగులు తీయనుంది. మహారాష్ట్రలోని దేవ్​లాలి నుంచి బిహార్​లోని దానాపుర్​కు వారానికి ఒకసారి నడిచే ఈ రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్​ గోయల్​, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​లు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించనున్నారు.

అతి తక్కువ కాలంలో పాడైపోయే కూరగాయలు, పండ్లు, పువ్వులు వంటి ఉత్పత్తుల్ని తక్కువ ఖర్చుతోనే వేగంగా గమ్యస్థానం చేరవేసేందుకు ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య విధానంలో కిసాన్​ రైళ్లను ప్రవేశపెడతామని ఇదివరకే బడ్జెట్​లో ప్రకటించింది కేంద్రం.

ఇదీ చదవండి: భారతీయ రైల్వే ప్రపంచ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.