ETV Bharat / bharat

తొలిదశలో 1.65 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు - దేశవ్యాప్తంగా వ్యాక్సిన్​ డోసుల పంపిణీ

జనవరి 16న దేశవ్యాప్తంగా కరోనా టీకా ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో 1.65 కోట్ల కరోనా టీకా డోసులను రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. టీకా డోసుల పంపిణీ విషయంలో రాష్ట్రాలపై వివక్ష చూపారన్న ఆరోపణలను తిప్పికొట్టింది.

Covid-19 vaccines land at various places
తొలిదశలో 1.65కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు
author img

By

Published : Jan 13, 2021, 10:19 PM IST

కరోనా మహమ్మారిని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అత్యవసర వినియోగం నిమిత్తం కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లకు అనుమతినివ్వడమే కాకుండా వివిధ రాష్ట్రాలకు వాటి సరఫరా ప్రారంభించింది. ఈ నెల 16న దేశవ్యాప్తంగా కరోనా టీకా ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆరోగ్య కార్యకర్తల డేటా ప్రకారం మొత్తం 1.65 కోట్ల కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ డోసుల టీకాలను రాష్ట్రాలకు పంపినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసింది.

jammu
కొవిడ్ టీకాల కోసం జమ్మూలో ఏర్పాటు చేసిన నిల్వ కేంద్రాలు

"దేశవ్యాప్తంగా 5 వేల కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియ మొదలు పెట్టాలని ఏర్పాట్లు చేశాం. ముందుగా ఖరారు చేసిన కేంద్రాల సంఖ్యను తగ్గించాం. ఈనెల 16న 2,934 కేంద్రాల్లో వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభిస్తాం. దేశ రాజధాని దిల్లీలో 89 కేంద్రాలకు బదులు 75 కేంద్రాల్లోనే టీకాలు ఇస్తాం. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి, 1.65కోట్ల డోసుల కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లను సరఫరా చేశాం. ఏ రాష్ట్రమూ తమకు వ్యాక్సిన్‌ను కేటాయించలేదన్న ప్రశ్నలకు తావులేదు. ప్రాథమిక దశలోనే భారీగా వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేశాం"

- ఆరోగ్య శాఖ.

రాబోయే వారాల్లో ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం సరఫరా చేసిన వ్యాక్సిన్‌ డోసులలో 10శాతం రిజర్వ్‌/వృథాతో పాటు, ఒకరోజులో కేవలం 100 వ్యాక్సినేషన్‌ సెషన్‌ మాత్రమే జరిగేలా చూడాలని సూచించింది. ఒకరోజులో నిర్దేశించిన సంఖ్యకు మించి వ్యాక్సిన్‌ ఇవ్వకూడదని రాష్ట్రాలకు స్పష్టంగా తెలియజేసినట్లు పేర్కొంది. దశలవారీగా వ్యాక్సిన్‌ సెషన్‌లను పెంచాలని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలిపినట్లు వెల్లడించింది.

rajasthan receives covid vaccines
రాజస్థాన్​కు చేరిన కొవిడ్ టీకా డోసులు
kerala receives vaccine
కేరళకు చేరిన కొవిడ్ డోసులు
chattisgarh receives covisheild
ఛత్తీస్​గఢ్​కు చేరిన కొవిషీల్డ్​ టీకా డోసులు

విమర్శ చూపలేదు..

కొవిడ్‌ టీకా డోసుల కేటాయింపులో రాష్ట్రాల పట్ల వివక్ష చూపారన్న విమర్శలను కేంద్రం కొట్టి వేసింది. తొలిదశలో కోటీ 65 లక్షల కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ డోసులు సేకరించినట్లు తెలిపింది. తమ వద్ద ఉన్న ఆరోగ్య సిబ్బంది డేటా ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కరోనా టీకా డోసులు సరఫరా చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో ఏ రాష్ట్రం పట్ల వివక్ష లేదని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని డోసులు సేకరించి రాష్ట్రాలకు కేటాయిస్తామని పేర్కొంది. టీకాల కొరత ఉందన్న భయాల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఆధారరహితమని కేంద్ర వైద్య శాఖ ప్రకటించింది.

  • First consignment of 56,500 doses Covid vaccine arrives at Maharaja Bir Bikram Airport, Agartala. In first phase of vaccination, health and frontline warriors will be vaccinated.

    I would like to thank Shri @narendramodi ji as we gears up for world's biggest vaccination drive. pic.twitter.com/EFzYUuLuPb

    — Biplab Kumar Deb (@BjpBiplab) January 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:'కేంద్రం కాకుంటే.. మేమే టీకాను ఫ్రీగా ఇస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.