గోవధపై కర్ణాటక ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన కొద్ది రోజులకే ఆ రాష్ట్రంలో తొలి కేసు నమోదైంది. గోవుల అక్రమ రవాణాకు పాల్పడ్డ నిందితులలో ఒకరిని పోలీసులు అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. చిక్మంగళూరు జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది.
హిందూ సంఘాల సమాచారం..
నిందితులు పశువులను హవేరీ జిల్లా రాణెబెన్నూరులో కొనుగోలు చేసి దక్షిణ కన్నడ జిల్లాలో విక్రయించాలని అనుకున్నారని పోలీసులు వెల్లడించారు. శృంగేరి సమీపంలోని తనికోడు చెక్పోస్ట్ వద్ద హిందూ సంఘాలు వీరిని అడ్డగించాయని తెలిపారు. వాహనాలను స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : గోవధ నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆర్డినెన్స్