అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు ఈ నెల 29న మన దేశంలో అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశలో ఐదు విమానాలు భారత వైమానిక దళంలో చేరతాయని ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధునాత ఆయుధ వ్యవస్థలు కలిగి ఉన్న వీటిని నడిపేందుకు మన పెలట్లు శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారని ఐఏఎఫ్ పేర్కొంది.
వైమానిక దళ అవసరాలు తీర్చడానికి 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం 2016 సెప్టెంబర్‌లో భారత్ రూ. 58వేల కోట్లతో ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి దశలో ఐదు విమానాలు ఈ నెల 29 దేశానికి రానుండగా.. మిగిలినవి ఆగస్టు చివరి కల్లా అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.
ఇదీ చూడండి:- రఫేల్ మోహరింపుపై వాయుసేన ఉన్నతాధికారుల చర్చ