ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్‌పై తమిళనాడు కారూర్ జిల్లాలోని అరవకురిచిలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. హిందువులపై కమల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే కేసు నమోదైంది. కమల్ వ్యాఖ్యలు రెండు వేర్వేరు వర్గాల మధ్య వివాదాలు తెచ్చేలా ఉన్నందున భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153ఏ, 295ఏ ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తమిళనాడులోని అరవకురిచిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఓ ప్రచార ర్యాలీలో కమల్ ప్రసంగిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్వతంత్ర భారత్‌లో ‘తొలి ఉగ్రవాది హిందువే’ అని వ్యాఖ్యానించారు. నాథూరామ్ గాడ్సేను ఉద్దేశిస్తూ కమల్ ఈ విమర్శలు చేశారు.
కమల్ వ్యాఖ్యలను భాజాపా, అన్నాడీఎంకే పార్టీలు ఖండించినా... కాంగ్రెస్, ద్రవిడ మున్నేట్ర కజగమ్ పార్టీలు కమల్‌కు మద్దతుగా నిలిచాయి.