కరోనాపై పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు వెల్లువ కొనసాగుతోంది. మహమ్మారి బారిన పడ్డ వారికి సాయం అందించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలకు చెందిన అధికారులు కలిసి రూ.430.63 కోట్ల విరాళం అందజేశారు.
వివరాలు...
ఇందులో ఎల్ఐసీ(జీవిత బీమా సంస్థ) 105 కోట్లు
ఎస్బీఐ (భారతీయ స్టేట్ బ్యాకు) రూ.100కోట్లు
ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) రూ.25 కోట్లు
నెలసరి ఆదాయం...
మానవ వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలోని 28 సంస్థలు, విభాగాలు కలిసి రూ.38 కోట్లను పీఎం కేర్స్ ఫండ్‌కు ఇచ్చాయి. హెచ్ఆర్డీ మంత్రి రమేశ్ పోక్రియాల్ తన నెలసరి వేతనాన్ని అందజేశారు. వాటితో పాటు ఎంపీలాడ్స్ నుంచి కోటి రూపాయలను ప్రకటించారు.
ఒక రోజు వేతనం విరాళంగా..
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు, సంబంధిత కార్యాలయాల్లోని సిబ్బంది ఒక రోజు వేతనం పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఈ క్రమంలో రూ.1.14 కోట్లు సమకూరినట్లు పేర్కొన్నారు.
మహమ్మారిపై పోరాడేందుకు పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 28న కోరారు.