సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచార పర్వం ముగిసింది. 7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 6న పోలింగ్ జరగనుంది. 674 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 8.75 కోట్ల మంది ప్రజలు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
మూడు, నాలుగో విడతలో పోలింగ్ జరిగిన జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఐదో దశలో ఓటింగ్ జరగనుంది.
భారీ భద్రత
పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. హింసాత్మక ఘటనలు జరుగుతున్న పశ్చిమ్‌బంగాలో భారీగా బలగాలను మోహరించింది.
ప్రధాన పార్టీల మధ్యే పోటీ...
ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో ఇటీవల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లోనూ అధిక స్థానాలను కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అదే సమయంలో మళ్లీ పుంజుకోవాలనుకుంటోంది భాజపా.