పండుగలు, శీతాకాలం వల్ల దేశంలో కరోనా వైరస్ విజృంభించే అవకాశముందని ప్రముఖ ఆరోగ్య నిపుణులు డా. తమోరిష్ కోలె తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే... రానున్న నెలల్లో 26లక్షల కొత్త కేసులు బయటపడతాయన్న ప్రభుత్వ ప్యానెల్ అంచనా నిజమవుతుందని ఈటీవీ భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
"శీతాకాలంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. పండుగ సీజన్ అయినందున.. ప్రజలు కలుసుకునే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు అధికం."
--- డా. తమోరిష్ కోలె, ఆరోగ్య నిపుణులు.
ఇందుకు కేరళను ఉదాహరణగా చూపించారు డా. కోలె. ఓనమ్ పండుగ అనంతరం ఆ రాష్ట్రంలో భారీగా కేసులు వెలుగుచూసినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరించినట్టు వివరించారు.
ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే ఎక్కడి నుంచి వచ్చమో తిరిగి అక్కడికే వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇదీ చూడండి:- పండుగ రోజుల్లో జాగ్రత్త! అప్రమత్తతే శ్రీరామరక్ష