ప్రముఖ నటుడు, జ్ఞానపీఠ్, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత, కన్నడ నాటక రచయిత గిరీశ్ కర్నాడ్ అంత్యక్రియలు కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగాయి. అధికారిక లాంఛనాలతో కర్నాడ్‌కు తుది వీడ్కోలు పలకాలని కర్ణాటక ప్రభుత్వం భావించినా... కుటుంబసభ్యులు అందుకు నిరాకరించారు.
కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ అంత్యక్రియల విషయమై కుటుంబ సభ్యులను సంప్రదించారు. ప్రభుత్వ లాంఛనాలతో తనకు అంత్యక్రియలు నిర్వహించవద్దని కర్నాడ్ కోరారని కుటుంబసభ్యులు సమాధానమిచ్చారు.
కర్నాడ్ భౌతిక ఖాయానికి ప్రముఖ జర్నలిస్టు రామచంద్ర గుహ, డీకే శివకుమార్, బి. జయశ్రీ తదితరులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరిగాయి.