ఉమ్మడి జమ్ముకశ్మీర్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫరూక్ అబ్దుల్లా నిర్బంధాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్బంధం సమయంలో ఆయన తన నివాసంలోనే ఉంటారని వెల్లడించారు.
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ప్రజా భద్రతా చట్టం కింద ఆగస్టు 5 నుంచి ఫరూక్‌ను గృహ నిర్బంధంలోనే ఉంచారు అధికారులు. శ్రీనగర్ గుప్కార్ రోడ్డులోని ఆయన ఇంటిని సబ్‌జైలుగా ప్రకటించారు.
ఫరూక్‌తోపాటు మాజీ ముఖ్యమంత్రులైన ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, మరికొందరు నేతలు గృహ నిర్బంధంలోనే ఉన్నారు.
మమత స్పందన....
ప్రజా సంరక్షణ చట్టం కింద మరో మూడు నెలలపాటు ఫరూక్ అబ్దుల్లాను నిర్బంధించటం ప్రజాసామ్య దేశంలో చాలా బాధాకరం. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధం.
-మమత బెనర్జీ ట్వీట్, బంగాల్ ముఖ్యమంత్రి