జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) కుంభకోణం కేసులో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అధ్యక్షడు ఫరూక్ అబ్దుల్లా... ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఫరూక్‌ను ఆరు గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. ఫరూక్... ఈడీ ఎదుట హాజరు కావడం ఈ వారంలో రెండోసారి.
ఫరూక్... జేకేసీఏకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రూ. 43.69 కోట్లు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణతో ఫరూక్ సహా పలువురిపై 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకే రంగంలోకి దిగిన ఈడీ... 2019 జులైలో ఫరూక్‌ను తొలిసారి ప్రశ్నించింది.
ఇదీ చూడండి: ఇంద్రావతి నదిలో పడవలు బోల్తా.. ఇద్దరు గల్లంతు