ఉగ్రవాదులకు పంపినట్లు రైతన్నలకు నోటీసులు పంపడాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తప్పుపట్టారు. అన్నం పెట్టే వారికి నోటీసులు పంపడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. వారేమీ ఉగ్రవాదులు, నక్సలైట్లు, పాక్, చైనా ఏజెంట్లు కాదని సూచించారు.
ఎన్‌ఐఏ వంటి దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వం చేతిలో తోలుబొమ్మలుగా మారాయని సుర్జేవాలా ఆరోపించారు. ఆయా సంస్థలను ఉపయోగించి సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను అడ్డుకోవాలని చూస్తున్నట్లు విమర్శించారు. అటువంటి వాటికి అన్నదాతలు వెనకంజ వేయరని తెలిపింది.