ETV Bharat / bharat

నేడు రైతులతో కేంద్రం మరో దఫా చర్చలు - farmers protest against farm laws

వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం నేడు మరోసారి చర్చలు జరపనుంది. చట్టాలను రద్దు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం తమకు సమ్మతం కాదంటున్న రైతు ప్రతినిధులు చర్చల్లో తమ వాణిని బలంగా వినిపిస్తామని స్పష్టంచేశారు. ఇవాళ్టిలోగా చట్టాల రద్దుకు కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దిల్లీలో అన్ని రోడ్లు దిగ్బంధిస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు.

farmers to have another round of talks with center
నేడు రైతులతో కేంద్ర మరో దఫా చర్చలు
author img

By

Published : Dec 3, 2020, 5:05 AM IST

నూతన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల ప్రతినిధులతో కేంద్రం నేడు మరోసారి చర్చలు జరపనుంది. ఈనెల 1న జరిపిన చర్చల్లో చట్టాలపై అభ్యంతరాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రులు చేసిన ప్రతిపాదనకు రైతు ప్రతినిధులు నిరాకరించారు.

ఇవాళ రైతులతో రెండో విడత చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వేమంత్రి పీయూష్ గోయల్‌తో బుధవారం భేటీ అయ్యారు. రైతులు లేవనెత్తిన సమస్యలపై నిర్మాణాత్మకంగా ఎలా స్పందించాలనే అంశంపై సమాలోచనలు జరిపారు. ఇవాళ రైతులతో చర్చలకు ముందు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌తో అమిత్ షా భేటీ కానున్నట్లు సమాచారం. కొన్నిరోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు చరమగీతం పాడటమే లక్ష్యంగా ఈ ఉదయం ఇరువురి మధ్య సమావేశం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

మరోవైపు వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని రైతు నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ చట్టాలను రద్దు చేసేందుకే పార్లమెంట్‌ భేటీ కావాలన్నారు. కేంద్ర ప్రభుత‌్వంతో ఇవాళ జరిగే చర్చల్లో అంశాలవారీగా అభ్యంతరాలను వివరిస్తామని చెప్పారు.

ఉద్ధృతంగా ఆందోళనలు

కేంద్ర వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన ఏడో రోజూ ఉద్ధృతంగా సాగింది. ఉద్యమానికి మద్దతుగా దిల్లీ సరిహద్దులకు వివిధ ప్రాంతాల రైతులు భారీగా తరలివస్తుండటంతో ఉత్కంఠ నెలకొంది. ఇంతవరకు పంజాబ్-హరియాణా సరిహద్దులకు పరిమితమైన ఉద్యమం ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దుల వైపు వ్యాపించింది. మూడు రాష్ట్రాల అన్నదాతలు ఆందోళనకు దిగడంతో ఉద్యమ సెగ దిల్లీకి తగిలింది. నగరానికి వచ్చే ఐదు మార్గాలను మూసేయాల్సి వచ్చింది. హరియాణా సరిహద్దులోని సింఘు, టిక్రిల వద్ద వారం రోజులుగా ధర్నా కొనసాగుతుండగా ఉత్తర్ ప్రదేశ్ పశ్చిమ ప్రాంతాలైన ఫిరోజాబాద్, మేరఠ్ నుంచి వేలాదిగా రైతులు వస్తుండటంతో నోయిడా సమీపంలోని చిల్లా సరిహద్దు వరుసగా రెండో రోజు కూడా మూతపడింది. అక్కడ ఉన్న రైతులంతా గౌతం బుద్ధ ద్వార్ వద్ద ఆందోళన చేస్తున్నారు. అన్నదాతలను నిలువరించేందుకు అన్ని చోట్లా భారీగా పోలీసులను మోహరించారు.

పెరుగుతున్న మద్దతు..

అన్నదాతల ఆందోళనలకు అన్ని ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. రైతులకు మద్దతుగా దిల్లీలోని కన్నాట్ ప్లేస్ వద్ద వామపక్షాలు ప్రదర్శన జరపగా, పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం దిల్లీ సరిహద్దులకు వెళ్లి రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్​, బి.వి.రాఘవులు పాల్గొన్నారు. చలో దిల్లీ ఆందోళనకు బయలుదేరిన రైతులపై హరియాణా ప్రభుత్వం బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించినందుకు నిరసనగా చండీగఢ్‌లో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి మనోహర్ లాల్​‌ ఖట్టర్ నివాసం ముందు ఘెరావ్‌ చేసెందుకు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

రైతులకు మద్దతుగా ఈ నెల 8 నుంచి ఉత్తరాదిలో వాహనాలను నిలిపివేస్తామని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ప్రకటించింది. ప్రభుత్వం స్పందించకపోతే దేశ వ్యాప్తంగా సమ్మెను విస్తరిస్తామని హెచ్చరించింది. ఈ సంఘం పరిధిలో 95 లక్షల లారీలు, 50 లక్షల బస్సులు, ట్యాక్సీలు ఉన్నాయి.

ఇదీ చూడండి: కశ్మీర్ మ్యాప్​పై వికీపీడియాకు కేంద్రం నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.