కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హరియాణాలోని రైతులు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిర్సా వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించి.. ధర్నాకు దిగారు.
![Farmers protest new agriculture law by blocking major road in Sirsa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8870713_raf.jpg)
![Farmers protest new agriculture law by blocking major road in Sirsa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8870713_5.jpg)
ప్రైవేటు కొనుగోలుదారులు.. వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర కంటే తక్కువకు సేకరించడం శిక్షార్హమైనదిగా ప్రభుత్వం చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు నిరసనకారులు. అదే తమకు భరోసా కల్పిస్తుందని అంటున్నారు.
![Farmers protest new agriculture law by blocking major road in Sirsa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8870713_3.jpg)
![Farmers protest new agriculture law by blocking major road in Sirsa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8868275_hg.jpg)
అంబాలాలోని సాదోపుర్ సరిహద్దు వద్ద ఆందోళనకు దిగిన రైతులను చెదరగొట్టేందుకు జలఫిరంగులు ప్రయోగించారు పోలీసులు. నిరసనకారులు వెనక్కితగ్గకపోగా... ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పంజాబ్‌లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతులు జిరాక్పుర్ నుంచి దిల్లీ వరకు ట్రాక్టర్ ర్యాలీని చేపట్టారు.
![Farmers protest new agriculture law by blocking major road in Sirsa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8870713_1.png)
![Farmers protest new agriculture law by blocking major road in Sirsa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8870713_2.png)