ETV Bharat / bharat

ధర్నా విరమించిన రైతులు - బుధవారం

రెండు రోజుల నుంచి పంజాబ్​లోని అమృత్​సర్​ రైల్వే పట్టాలపై ధర్నాకు దిగిన​ రైతులు పంజాబ్​, హర్యానా హై కోర్టు జోక్యంతో ధర్నా విరమించారు.

పంజాబ్​ రైతులు
author img

By

Published : Mar 6, 2019, 8:19 PM IST

దిల్లీ-అమృత్​సర్​ రైల్వే లైన్లపై రెండు రోజులుగా పంజాబ్​ రైతులు చేస్తోన్న ధర్నాను బుధవారం విరమించారు. పంజాబ్​, హర్యానా హైకోర్టు కలుగజేసుకున్నందున రైతులు ధర్నా విరమించారని పోలీసులు తెలిపారు. ధర్నాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న 'కిసాన్​ మజ్దూర్​ సంఘర్ష్​' కమిటీ నేతలకు వ్యతిరేకంగా హై కోర్టులో మంగళవారం ఓ పిటిషన్ దాఖలైంది.

దీంతో బుధవారం కోర్టుకు హాజరవ్వాలని కమిటీ నేతలను కోర్టు ఆదేశించింది. కోర్టుకు హాజరయ్యేందుకు రైతు నేతలు హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

రైతుల ధర్నా కారణంగా రెండు రోజుల్లో 11 రైళ్లు రద్దయ్యాయి. 38 రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

'కిసాన్​ మజ్దూర్​ సంఘర్ష్'​ కమిటీ నేతృత్వంలో పంజాబ్​ రైతులు పూర్తి రుణమాఫీతో పాటు పలు ఇతర డిమాండ్లతో ధర్నాకు దిగారు. వాటిలో ముఖ్యంగా స్వామినాథన్ కమిషన్​ సిఫార్సు అమలు చేయాలని పట్టుపట్టారు.

New Delhi, Mar 06 (ANI): In a press briefing by Congress party on the issue of Rafale deal, National Spokesperson Randeep Singh Surjewala said, "The falsehood and dishonesty and corruption is now writ large based on the report of the Indian Negotiation Team (INT) which has been placed in public domain. As per the report of INT the price of 36 aircrafts is Rs. 63,450 crore, and not what is claimed by Prime Minister Narendra Modi and his government which is Rs. 59,000 crore."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.