ETV Bharat / bharat

స్మార్ట్​ ఫోన్​ కొనలేదని మరో విద్యార్థిని ఆత్మహత్య!

కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏర్పాటు చేసిన ఆన్​లైన్​ క్లాసులు ఆ కుటంబాన్ని తీరని విషాదంలోకి నెట్టాయి. స్మార్ట్​ ఫోన్​ కొనివ్వలేని పేదరికం ఆ తండ్రికి కంటికి రెప్పలా పెంచిన కూతుర్ని శాశ్వతంగా దూరం చేసింది.

Farmer's daughter died
స్మార్ట్​ ఫోన్​ కొనలేదని మరో విద్యార్థిని ఆత్మహత్య!
author img

By

Published : Sep 1, 2020, 6:51 PM IST

Updated : Sep 1, 2020, 7:20 PM IST

ఆన్​లైన్​ క్లాసులు మరొక విద్యార్థి ఉసురు తీశాయి. స్మార్ట్​ ఫోన్​ కొనలేదని తమిళనాడు కల్లాకురిచి జిల్లా ఉలుందుర్​ పేటకు చెందిన నిత్యశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

స్మార్ట్​ ఫోన్​ కొనలేదని మరో విద్యార్థిని ఆత్మహత్య!

ఇదీ జరిగింది...

అరుముగన్​కు ముగ్గురు కూతుళ్లు. కరోనా వ్యాప్తి కారణంగా ఆన్​లైన్​ క్లాసులకు హాజరయ్యేందుకు ముగ్గురికీ స్మార్​ ఫోన్​ అవసరమైంది. అయితే అంత స్తోమత లేని అరుముగన్​ రూ.20 వేలు పెట్టి ముగ్గురికీ కలిపి ఒక స్మార్ట్​ ఫోన్​ కొనిచ్చాడు. అయితే ఏకకాలంలో ముగ్గురు ఆన్​లైన్​ క్లాసులకు హాజరుకాలేకపోతున్నారు. ఒక్కరు మాత్రమే హాజరవుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో స్మార్ట్​ ఫోన్​ కొనివ్వాలని కూతుళ్లు అరుముగన్​ను అడిగారు. అయితే డబ్బులు లేక కాదన్నాడు.

తీవ్ర మనస్తాపానికి గురైన పెద్ద కూతురు నిత్య ఆగస్ట్ 29న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులు మందు తాగింది. పొలం పనుల నుంచి వచ్చిన అరుముగన్​ నిత్యను వెంటనే ఉలుందర్​పేట ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అయితే చికిత్స చేసినప్పటికీ ఆమె సోమవారం చనిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఐదుగురు భర్తలుండగా.. 22 ఏళ్ల ప్రియుడితో ఆరో పెళ్లి!

Last Updated : Sep 1, 2020, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.