ETV Bharat / bharat

అన్నదాతలకు అన్నివైపుల నుంచి మద్దతు

farmers Protest continue
కొనసాగుతున్న రైతుల ఆందోళన
author img

By

Published : Nov 30, 2020, 10:30 AM IST

Updated : Nov 30, 2020, 10:09 PM IST

22:01 November 30

దిల్లీ పరిసరాల్లో నిరసన చేస్తున్న రైతులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. తాజాగా హరియాణా పశుదాన్ బోర్డు ఛైర్మన్ సోంబిర్ సంగ్వాన్ తన పదవికి రాజీనామా చేశారు. హరియాణాలోని దాద్రీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న ఆయన.. రేపు ఉదయం పది గంటలకు సంఘాల ప్రతినిధులతో కలిసి దిల్లీకి చేరుకోనున్నట్లు చెప్పారు. చివరి క్షణం వరకు రైతులకు మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు.  

మరోవైపు పలువురు పంజాబీ సింగర్లు అన్నదాతలకు మద్దతిస్తున్నారు. సిధు మూసేవాలా, బబ్బు మాన్, కన్వార్ గ్రేవాల్, హార్ఫ్ చీమా తదితరులు వారికి మద్దతు ప్రకటించారు. రైతులు నిరసన చేస్తున్న టిక్రి ప్రాంతానికి చేరుకున్న మూసేవాలా.. కర్షకుల ఆందోళనలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు.  

21:24 November 30

దేశరాజధానికి చేరుకొనే అన్ని మార్గాలను మూసేస్తామని రైతులు ఆదివారం హెచ్చరించిన నేపథ్యంలో దిల్లీ పోలీసులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దిల్లీని అనుసంధానించే రహదారులపై భద్రతను పెంచారు. హరియాణా, యూపీ రాష్ట్రాల సరిహద్దు పాయింట్ల వద్ద బలగాలను భారీగా మోహరించారు. 

మరోవైపు రైతులు తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. గురునానక్ జయంతి సందర్భంగా సింఘు సరిహద్దులో కొవ్వొత్తులను వెలిగించి తమ నిరసన వ్యక్తం చేశారు.

17:36 November 30

'పోరాటం ఉద్ధృతం చేయాలి'

  • మన్‌కీ బాత్‌లో ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి
  • వ్యవసాయ చట్టాలపై ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన అఖిల భారత రైతు పోరాట సమితి
  • రైతుల డిమాండ్లు తీర్చేందుకు కేంద్రం సిద్ధంగా లేదని స్పష్టం: రైతు పోరాట సమితి
  • పోరాటం ఉద్ధృతం చేయాలి: అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి
  • సమీప రాష్ట్రాల్లోని రైతులు దిల్లీ చేరుకోవాలని రైతు పోరాట సమన్వయ సమితి పిలుపు
  • దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి: రైతు పోరాట సమితి
  • ప్రజలంతా 'రైతుల వెంటే మేము' అంటూ మద్దతు ఇవ్వాలి: రైతు పోరాట సమితి

11:59 November 30

మెడికల్ క్యాంప్..

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దు ప్రాంతమైన సింఘు వద్ద నిరసన తెలుపుతున్న రైతుల కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు వైద్యులు. కరోనా వ్యాపించేందుకు అవకాశమున్న నేపథ్యంలో.. రైతులకు కొవిడ్ పరీక్షలు చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. ఎక్కువ మంది ఒకే దగ్గర గుమిగూడుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కరోనా వ్యాప్తి చెందొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

11:37 November 30

బురాడిలో ఆందోళన..

దిల్లీ సరిహద్దులతో పాటు .. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా సూచించిన బురాడిలోని నిరంకారి మైదానంలోనూ రైతులు ఆందోళన చేస్తున్నారు. నిరసన ఉద్రిక్తంగా మారాకుండా మైదానం పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిద్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.

10:40 November 30

శాంతియుతంగా నిరసనలు..

కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులు ఆందోళను చేస్తున్నారు. దిల్లీ-హరియాణా సరిహద్దుల్లో సింఘు వద్ద బైటాయించాలని రైతులు నిర్ణయించిన నేపథ్యంలో.. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ప్రస్తుతం పరిస్థితులు ఆదుపులోనే ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

గురునానక్​ జయంతి సందర్భంగా శాంతియుతంగానే నిరసనలు తెలపాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. కేంద్రం తమ మొర వినడం లేదని అందుకే.. నిరసనలు చేపడుతున్నట్లు చెబుతున్నారు రైతులు. తమ డిమాండ్​లు నెరవేర్చే వరకు ఆందోళనలు విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. తమ నిరసనలకు మద్ధతుగా నిలుస్తున్న దిల్లీ ప్రజలకు రైతులు కృతజ్ఞతలు చెబుతున్నారు.

10:02 November 30

దిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన

  • దిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన
  • రైతుల ఆందోళనతో దిల్లీ-హరియణా ప్రధాన రహదారి మూసివేత
  • సింఘు, టిక్రీ, ఘాజిపూర్ సరిహద్దుల వద్ద కొనసాగిస్తున్న రైతుల నిరసన
  • ఎముకలు కొరికే చలిలోనూ రోడ్లపైనే బైఠాయించిన అన్నదాతలు
  • కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతుల డిమాండ్
  • కేంద్రం షరతులతో చర్చలకు పిలవడాన్ని వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు
  • దిల్లీ సరిహద్దుల వద్ద పంజాబ్, హరియణా, యూపీ రాష్ట్రాల వేలాదిమంది రైతులు
  • దిల్లీలోని నిరంకారి మైదానానికి వెళ్లేందుకు రైతుల నిరాకరణ
  • దిల్లీ వెళ్లే ప్రధాన రోడ్లను దిగ్బంధిస్తామని ఆదివారం రైతు సంఘాల ప్రకటన
  • ఉదయం 11 గంటలకు సింఘు సరిహద్దు వద్ద రైతు సంఘాల సమావేశం
  • భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న రైతు సంఘాలు

Last Updated : Nov 30, 2020, 10:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.