ETV Bharat / bharat

'ఫిబ్రవరి 1న దిల్లీలో పాదయాత్ర చేపడుతాం' - కొత్త బడ్జెట్​ ప్రవేశ పెట్టే రోజు

గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీకి సన్నద్ధమైన అన్నదాతలు.. మరో ప్రదర్శనకు సిద్దమయ్యారు. బడ్జెట్​ ప్రవేశ పెట్టే ఫిబ్రవరి1న పార్లమెంటు వరకు పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు.

Farmer unions now announce plan to march towards Parliament on Budget day
పార్లమెంటు వరకు రైతుల పాద యాత్ర
author img

By

Published : Jan 25, 2021, 8:33 PM IST

సాగు చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం నాడు.. దిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ తలపెట్టిన రైతులు.. మరో ర్యాలీకి సిద్ధమయ్యారు. పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రవేశ పెట్టే ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటు​ వరకు పాద యాత్ర చేస్తామని తెలిపారు.

"దేశం నలుమూలల నుంచి దిల్లీలోని టాక్టర్ల ర్యాలీ వచ్చిన వారు తిరిగి వెళ్లాలనుకోవడం లేదు. మాతో కలిసి ఆందోళన కొనసాగిస్తామంటున్నారు. అందుకే బడ్జెట్​ సెషన్​ సందర్భంగా ఫిబ్రవరి 1న పార్లమెంటు వరకు పాద యాత్ర చేయాలని నిర్ణయించాం. మా డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనను కొనసాగిస్తాం."

-దర్శన్​ పాల్​, క్రాంతికారి కిసాన్ సంఘం నేత

దిల్లీలో గణతంత్ర వేడుకులు ముగిసిన తర్వతనే ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు రైతులు. ర్యాలీ కోసం మూడు మార్గాలను ఎంపిక చేశారు. మొదటిది సింఘు సరిహద్దు నుంచి ఖర్ఖోడా టోల్​ ప్లాజా వరకు 63కి.మీల మార్గం. రెండోది టిక్రీ సరిహద్దు నుంచి అసోడా టోల్​ ప్లాజా వరకు 62 కిలోమీటర్ల మార్గం. ఘజియాబాద్​ నుంచి లాల్​ ఖౌన్​ వరకు సాగే 68కిలో మీటర్ల మార్గం మూడోది.

ఇదీ చూడండి: రైతన్న 'ట్రాక్టర్​ ర్యాలీ'కి సర్వం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.