ETV Bharat / bharat

'ఆ నాలుగు ప్రతిపాదనలు చర్చలో ఉండాల్సిందే' - famer protests

ఆరోసారి కేంద్రంతో చర్చించడానికి అంగీకరించిన రైతు సంఘాలు.. నాలుగు అంశాలు ప్రధాన అజెండాగా చర్చలకు హాజరవుతున్నట్లు వెల్లడించాయి. కేంద్ర వ్యవసాయ శాఖకు రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొన్నాయి.

Farmer leader accepts govt proposal to talk on December 30
'నాలుగు అజెండాలతో మరోసారి చర్చలకు సిద్ధం'
author img

By

Published : Dec 29, 2020, 9:13 PM IST

Updated : Dec 29, 2020, 10:13 PM IST

సమస్యలను పరిష్కరించేందుకు ఆరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రంతో భేటీ కావడానికి అంగీకరించారు రైతు సంఘాల నాయకులు. ఈ మేరకు అంగీకారం తెలుపుతూ కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శికి సంయుక్త కిసాన్ మోర్చా లేఖ రాసింది. నాలుగు అంశాలు ప్రధాన అజెండాగా బుధవారం(డిసెంబర్​ 30న)చర్చలకు హాజరవుతున్నట్లు పునరుద్ఘాటించాయి రైతు సంఘాలు. తాము సూచించిన ప్రతిపాదనలు చర్చలో ఉండాలని లేఖలో స్పష్టం చేశారు నాయకులు.

రైతు సంఘాల ప్రతిపాదనలు

  • కొత్త సాగు చట్టాలను రద్దు చేసేందుకు విధివిధానాల రూపకల్పన
  • రైతుల పంటకు కనీస మద్దతు ధర హామీకు చట్టబద్దత కల్పించడం
  • దిల్లీ గాలి నాణ్యత ఆర్డినెన్స్ లో రైతులకు మినహాయింపు
  • విద్యుత్ బిల్లు 2020ని వెనక్కి తీసుకోవడం

ఇదీ చూడండి: 'ఈసారి చర్చలు విఫలమైతే రంగంలోకి దిగుతాం'

Last Updated : Dec 29, 2020, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.