ETV Bharat / bharat

'కాంగ్రెస్ వస్తే వ్యవసాయ చట్టాలు చెత్తబుట్టలోకి' - రాహుల్ గాంధీ న్యూస్

కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే మోదీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను చెత్తబుట్టలో పడేస్తుందని తెలిపారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ. ఈ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్​లో ఆదివారం ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించారు.

Farm-laws-to-be-consigned-to-wastepaper-basket-the-day-Cong-forms-govt-at-Centre-Rahul
'కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయ బిల్లులు చెత్తబుట్టలోకి'
author img

By

Published : Oct 5, 2020, 4:26 AM IST

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎన్​డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలను రద్దు చేసి చెత్తబుట్టలో వేస్తామని ఆ పార్టీ నేత రాహుల్‌ గాంధీ తెలిపారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లోని మోగాలో 'ఖేతీ బచావో' పేరుతో ట్రాక్టర్‌ ర్యాలీని ఆదివారం ప్రారంభించారు​. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం చేసే చర్యలను చేపట్టిందని మండిపడ్డారు. పెద్ద పారిశ్రామికవేత్తల రుణాలను మాఫీ చేస్తున్న కేంద్రం.. రైతులను మాత్రం పట్టించుకోవడం లేదని రాహుల్​ ఆరోపించారు.

కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి బిల్లులు తీసుకురావాల్సిన అవసరం ఏముందని కేంద్రాన్ని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. రైతుల శ్రేయస్సు కోసమే బిల్లులు తెచ్చామన్న మోదీ.. ఎందుకు పార్లమెంటులో చర్చ నిర్వహించలేదన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను నాశనం చేసి, కనీస మద్దతు ధరకు మంగళం పాడడమే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని రాహుల్‌ ఆరోపించారు. గత ఆరేళ్లుగా ప్రధాని అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌, నవజోత్‌సింగ్‌ సిద్ధూ, పార్టీ నేతలు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు ఈ ర్యాలీలు కొనసాగనున్నాయి.

6,7 తేదీల్లో హరియాణాలో..

పంజాబ్​ అనంతరం హరియాణాలో 6,7 తేదీల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించనున్నారు రాహుల్ గాంధీ. కురుక్షేత్ర, కర్నల్ జిల్లాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే ఆందోళనలలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ నేతలు సమావేశమై చర్చించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.