ఫొని తుపాను మృతుల సంఖ్య ఒడిశాలో 64కు పెరిగింది. శనివారం వరకు మృతుల సంఖ్య 43 ఉండగా.. తుపాను కారణంగా మరో 21మంది మృతి చెందినట్టు గుర్తించామని ఒడిశా ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. అత్యధికంగా పూరీలో 39మంది చనిపోయారు. మే 3న ఒడిశాలో తీరం దాటిన ఫొని తుపాను ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది.
64మందిలో 25మంది గోడ కూలి చనిపోగా, 20మంది చెట్లు మీదపడి మృతి చెందారు. ఆరుగురు ఇంటి పైకప్పు కూలిన కారణంగా కన్నుమూశారు. మరో 13మంది మృతికి కారణాలు తెలియరాలేదు.
ఫొని ధాటికి 241మందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. గాయాలైన వారిలో 160మంది పూరీ పట్టణానికి చెందినవారు కాగా, 74మంది జాజ్పుర్ వాసులు.
1.65 కోట్ల మందిపై ఫొని తుపాను ప్రభావం చూపింది. 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 14 జిల్లాల్లోని 18,168 గ్రామాలు, 52 పట్టణ ప్రాంతాల్లో తుపాను బీభత్సం సృష్టించింది.
ఇదీ చూడండి: లండన్ బాబుకు వెండి మొలతాడు, హనుమాన్ లాకెట్