ఒడిశాలోని బార్గఢ్ జిల్లాలో నకిలీ కరోనా మందులను తయారు చేస్తున్న ఓ కేంద్రంపై అధికారులు సోదాలు నిర్వహించారు. రుసుడా గ్రామంలో.. బార్గఢ్- సంబల్పుర్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా.. ఔషధానికి సంబంధించి 12 సీసాలు, స్టిక్కర్లను గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రహ్లాద్ బిషి అనే వ్యక్తికి నోటీసులు జారీ చేశారు.
అయితే.. ఇవి నకిలీ మందులు కావని.. కరోనాపై ఇవి సమర్థంగా పనిచేస్తున్నాయని బిషి పేర్కొన్నారు.
"కరోనాకు చికిత్స కోసం ఈ మందులను నేను స్వయంగా తీసుకున్నా. నేను రూపొందించిన మందు కరోనాపై 100 శాతం పనిచేస్తుంది. డ్రగ్ ఇన్స్పెక్టర్, ప్రభుత్వానికి ఈ విషయాన్ని నేనే స్వయంగా తెలియజేశాను. ట్రయల్స్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరాను."
--- ప్రహ్లాద్ బిషి, బార్గఢ్వాసి
ఇదీ చూడండి:- 'కలిసికట్టుగా లేకుంటే 20 లక్షల కొవిడ్ మరణాలు!'