రైలు ప్రయాణానికి ఐఆర్సీటీసీలో నేటి నుంచి సేవా పన్ను విధిస్తున్నట్లు భారత రైల్వే శాఖ తెలిపింది. ఈ మేరకు ఆగస్టు 30న ఆదేశాలు జారీ చేసింది. 'ఈ-టికెట్' బుక్ చేసుకుంటే నాన్ ఏసీకి రూ.15, ఏసీకి రూ. 30 అదనంగా చెల్లించవలసి వస్తుంది
గతంలో రేట్లు
ప్రధాని నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియాలో భాగంగా ఐఆర్సీటీసీలో సేవా పన్ను రద్దు చేశారు. గతంలో బుకింగ్స్‌పై నాన్ ఏసీకి రూ. 20, ఏసీకి రూ. 40 చొప్పున సేవా పన్ను విధేంచేవారు. 3 ఏళ్ల క్రితం ఈ పన్ను తొలగించారు.
వీరికి ఊరట
ప్రధాని మోదీ డిజిటల్ ఇండియాలో భాగంగా భీమ్ యాప్, యూపీఐ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నవారికి కొంత వెసులుబాటు కల్పించారు. నాన్ ఏసీ బుకింగ్ చేసుకునేవారు రూ.10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.